సముద్ర శాస్త్రం
1. ఖండతీరం నుంచి 180 మీ. లోతు వరకు ఉన్న ఖండ భాగాన్ని ఏమని పిలుస్తారు?
1) ఖండతీర వాలు
2) అగాథ సముద్ర మైదానం
3) అగాథ సముద్ర ప్రాంతాలు
4) ఖండతీర అంచు
- View Answer
- సమాధానం: 4
2. సముద్ర లోతును ఏ ప్రమాణాల్లో తెలుపుతారు?
1) నాటికల్ మైల్
2) పాథమ్
3) కిలోమీటర్లు
4) అడుగులు
- View Answer
- సమాధానం:2
3. సమాన సముద్ర లోతు ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు?
1) ఐసోబార్లు
2) ఐసోహైట్స్
3) ఐసోబాథ్స
4) ఐసోహాలైన్స్
- View Answer
- సమాధానం:3
4. కింది వాటిలో సరికానిది ఏది?
1) పసిఫిక్ మహాసముద్రం - ఈ (డెల్టా) ఆకారం
2) అట్లాంటిక్ మహాసముద్రం - ఆకారం
3) దక్షిణ మహాసముద్రం - కల్లోల సముద్రం
4) హిందూ మహాసముద్రం - క ఆకారం
- View Answer
- సమాధానం: 3
5. సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన భూభాగం కొన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?
1) బేసిన్
2) అగ్రం
3) సింధుశాఖ
4) అఖాతం
- View Answer
- సమాధానం: 2
6. సముద్ర జలాల సగటు లవణీయత ఎంత శాతం ఉంటుంది?
1) 35%
2) 45%
3) 55%
4) 235%
- View Answer
- సమాధానం:1
7. తరంగ ప్రభావం వల్ల తీర ప్రాంతం అర్ధ చంద్రాకారంగా మారితే దాన్ని ఏమని పిలుస్తారు?
1) సింధుశాఖ
2) అగ్రం
3) షోల్
4) అఖాతం
- View Answer
- సమాధానం:4
8. ఏ మహాసముద్రానికి ఉత్తరాన ‘బేరింగ్ జలసంధి’ సరిహద్దుగా ఉంది?
1) పసిఫిక్ మహాసముద్రం
2) అట్లాంటిక్ మహాసముద్రం
3) హిందూ మహాసముద్రం
4) అంటార్కిటికా మహాసముద్రం
- View Answer
- సమాధానం: 1
9. ‘సీమౌంట్స్’ అంటే ఏమిటి?
1) సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన ఇసుకదిబ్బలు
2) జీవ సంబంధమైన దిబ్బలు
3) సముద్రాల లోపలి భాగంలో 1000 మీ. ఎత్తుకు పైగా ఉండే పర్వతాలు
4) సముద్రాల్లో లోతు తక్కువగా ఉండే భూభాగం
- View Answer
- సమాధానం: 3
10.ప్రిన్స్ ఎడ్వర్డ్స్ రిడ్జ్ ఏ మహాసముద్రంలో ఉంది?
1) హిందూ మహాసముద్రం
2) దక్షిణ మహాసముద్రం
3) పసిఫిక్ మహాసముద్రం
4) అట్లాంటిక్ మహాసముద్రం
- View Answer
- సమాధానం: 1
11. ‘ప్రశాంత మహాసముద్రం’ అని దేన్ని పిలుస్తారు?
1) అట్లాంటిక్ మహాసముద్రం
2) హిందూ మహాసముద్రం
3) ఆర్కిటిక్ మహాసముద్రం
4) పసిఫిక్ మహాసముద్రం
- View Answer
- సమాధానం: 4
12. ఒకే లవణీయత విలువలున్న ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు?
1) ఐసోబాథ్స్
2) ఐసోహైట్స్
3) ఐసోహాలైన్స్
4) ఐసోబార్స్
- View Answer
- సమాధానం: 3
13. సముద్రంలో ఏ భాగంలో చేపలు లాంటి జలచరజీవులు ఎక్కువగా పెరుగుతాయి?
1) ఖండతీర అంచు
2) ఖండతీర వాలు
3) అగాథ సముద్ర మైదానం
4) అగాథాలు
- View Answer
- సమాధానం: 1
14. ‘డాగర్ మత్స్య బ్యాంకు’ ఏ దేశంలో ఉంది?
1) అమెరికా
2) ఇంగ్లండ్
3) ఆస్ట్రేలియా
4) కెనడా
- View Answer
- సమాధానం:2
15. ప్రపంచంలో అతి వెడల్పైన ఖండతీర అంచులు ఉన్న మహాసముద్రం ఏది?
1) పసిఫిక్ మహాసముద్రం
2) దక్షిణ మహాసముద్రం
3) ఆర్కిటిక్ మహాసముద్రం
4) అట్లాంటిక్ మహాసముద్రం
- View Answer
- సమాధానం: 4
16. సోమాలియా శీతల ప్రవాహం ఏ మహాసముద్రంలో భాగం?
1) అట్లాంటిక్ మహాసముద్రం
2) పసిఫిక్ మహాసముద్రం
3) హిందూ మహాసముద్రం
4) దక్షిణ మహాసముద్రం
- View Answer
- సమాధానం:3
17.కలహారి ఎడారి ఏర్పడటానికి కారణమైన శీతల సముద్ర ప్రవాహం ఏది?
1) కెనరీ
2) పెరూవియన్
3) కాలిఫోర్నియా
4) బెంగుల్యా
- View Answer
- సమాధానం: 4
18. చంద్రుడు, సూర్యుడి ఆకర్షణల నిష్పత్తి ఎంత?
1) 5 : 11
2) 11 : 5
3) 6 : 13
4) 13 : 6
- View Answer
- సమాధానం: 2
19. ఒక పోటు, పాటుకు మధ్య వ్యత్యాసం ఎంత ఉంటుంది?
1) 12 గంటల 26 నిమిషాలు
2) 24 గంటల 52 నిమిషాలు
3) 6 గంటల 13 నిమిషాలు
4) 5 గంటల 26 నిమిషాలు
- View Answer
- సమాధానం: 3
20. ఒక ప్రదేశంలో వర్షపాతం పెరిగే కొద్దీ ఆ ప్రాంత సముద్ర లవణీయత ఏమవుతుంది?
1) తగ్గుతుంది
2) పెరుగుతుంది
3) ముందు పెరిగి, ఆ తర్వాత తగ్గుతుంది
4) మారదు
- View Answer
- సమాధానం: 1
21.భారతదేశంలో అధికంగా ‘పోటు’లు సంభవించే ‘ఓక్లా’ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఒడిశా
2) మహారాష్ట్ర
3) గుజరాత్
4) పశ్చిమబెంగాల్
- View Answer
- సమాధానం: 3
22. పర్వవేలా పోటుపాట్లు నెలలో ఎన్నిసార్లు సంభవిస్తాయి?
1) 2
2) 3
3) 4
4) 6
- View Answer
- సమాధానం: 1
23. హిందూ మహాసముద్ర ద్వీపం ‘డిగోగార్షియా’లో మిలటరీ స్థావరం కలిగి ఉన్న దేశం ఏది?
1) రష్యా
2) ఇంగ్లండ్
3) జర్మనీ
4) అమెరికా
- View Answer
- సమాధానం: 4
24. కింది వాటిలో అట్లాంటిక్ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థకు సంబంధించనిది ఏది?
1) లాబ్రడార్ ప్రవాహం
2) గల్ఫ్‌స్ట్రీమ్ ప్రవాహం
3) కురుషివో ప్రవాహం
4) బెంగుల్యా ప్రవాహం
- View Answer
- సమాధానం: 3
25. కింది వాటిలో శీతల ప్రవాహం కానిది ఏది?
1) కాలిఫోర్నియా ప్రవాహం
2) సుసీమా ప్రవాహం
3) కామ్ చెట్కా ప్రవాహం
4) ఉత్తర పసిఫిక్ డ్రిఫ్ట్
- View Answer
- సమాధానం: 2
26. ఏ ప్రవాహాన్ని ‘యూరప్‌కు వెచ్చని దుప్పటి’గా పేర్కొంటారు?
1) గల్ఫ్‌స్ట్రీమ్
2) లాబ్రడార్
3) బెంగుల్యా
4) కాలిఫోర్నియా
- View Answer
- సమాధానం: 1
27. మొజాంబిక్ ప్రవాహం ఏ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థకు సంబంధించింది?
1) పసిఫిక్
2) అట్లాంటిక్
3) హిందూ
4) ఆర్కిటిక్
- View Answer
- సమాధానం: 3
28. కెనరీ శీతల ప్రవాహం వల్ల ఏర్పడిన ఎడారి ఏది?
1) సోనారన్ ఎడారి
2) అటకామా ఎడారి
3) కలహారి ఎడారి
4) సహారా ఎడారి
- View Answer
- సమాధానం: 4
29. మొదటి రోజు వచ్చే పోటు కంటే రెండో రోజు వచ్చే మొదటి పోటు ఎంత ఆలస్యంగా వస్తుంది?
1) 6 గంటల 13 నిమిషాలు
2) 12 గంటల 26 నిమిషాలు
3) 13 నిమిషాలు
4) 53 నిమిషాలు
- View Answer
- సమాధానం: 4
30. సముద్ర భూతల విస్తీర్ణంలో ఖండతీరపు వాలు ఎంత శాతం ఉంటుంది?
1) 7.5%
2) 8.5%
3) 9.5%
4) 82.7%
- View Answer
- సమాధానం: 2
31.అగ్ని పర్వతాలకు చెందిన ఎర్రమట్టి, సముద్ర జీవరాశులకు చెందిన నిక్షేపాలు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి?
1) ఖండతీర అంచు
2) ఖండతీర వాలు
3) అగాథ సముద్ర మైదానం
4) మహాసముద్ర అగాథం
- View Answer
- సమాధానం: 3
32. ‘టస్కరోరా’ అగాథం ఏ మహాసముద్రంలో ఉంది?
1) పసిఫిక్
2) అట్లాంటిక్
3) హిందూ
4) ఆర్కిటిక్
- View Answer
- సమాధానం: 1
33. ఏ మహాసముద్రంలో అధిక సంఖ్యలో దీవులు ఉన్నాయి?
1) దక్షిణ
2) ఆర్కిటిక్
3) అట్లాంటిక్
4) పసిఫిక్
- View Answer
- సమాధానం: 4
34. సముద్ర భూతలానికి చెందిన ఏ భాగంలో భూకంపాలు అధికంగా సంభవిస్తాయి?
1) ఖండతీర అంచు
2) ఖండతీర వాలు
3) అగాథ సముద్ర మైదానం
4) మహాసముద్ర అగాథం
- View Answer
- సమాధానం: 4
35.సముద్ర భూతల విస్తీర్ణంలో ‘మహాసముద్ర అగాథాలు’ ఎంతశాతం కలిగి ఉన్నాయి?
1) 7.5%
2) 2.1%
3) 1.2%
4) 3.1%
- View Answer
- సమాధానం: 3
36. ‘టెలిగ్రాఫ్’ పీఠభూమి ఏ మహాసముద్రంలో భాగంగా ఉంది?
1) ఆర్కిటిక్
2) అట్లాంటిక్
3) దక్షిణ
4) హిందూ
- View Answer
- సమాధానం: 2
37. ‘ఫాక్లాండ్’ శీతల ప్రవాహం ఏ మహాసముద్రంలో భాగం?
1) పసిఫిక్
2) అట్లాంటిక్
3) హిందూ
4) దక్షిణ
- View Answer
- సమాధానం: 2
38. ఉత్తర ధ్రువాన్ని ఆవరించి ఉన్న మహాసముద్రం ఏది?
1) పసిఫిక్
2) అట్లాంటిక్
3) హిందూ
4) ఆర్కిటిక్
- View Answer
- సమాధానం: 4
39. కింది వాటిలో అతి తక్కువ లవణీయతను కలిగి ఉండే సముద్రం ఏది?
1) కాస్పియన్
2) ఎర్ర సముద్రం
3) బాల్టిక్ సముద్రం
4) అరల్ సముద్రం
- View Answer
- సమాధానం:3
40. ప్రపంచంలో లోతైన కందకం ఏ సముద్రంలో ఉంది?
1) ఉత్తర అమెరికా సముద్రం
2) పసిఫిక్ మహాసముద్రం
3) అరేబియన్ సముద్రం
4) అట్లాంటిక్ మహాసముద్రం
- View Answer
- సమాధానం: 2
41. కింది వాటిలో అధిక లవణీయత ఉన్న మహాసముద్రం ఏది?
1) పసిఫిక్
2) అంటార్కిటిక్
3) ఆర్కిటిక్
4) అట్లాంటిక్
- View Answer
- సమాధానం:4
42. పేలియోజిక్ నిక్షేపాల్లో అత్యధిక శాతం ఉండేది ఏది?
1) రేడియో లేరియా
2) గ్లోబిజెరినా
3) ఎర్రమన్ను
4) డయాటమ్
- View Answer
- సమాధానం: 3
43.సింధూర బంకమన్ను ఏ పదార్థ సమ్మేళనం వల్ల ఏర్పడుతుంది?
1) ఐరన్ ఆక్సైడ్, ఎర్రరంగు ఓకర్
2) డయాటమ్, రేడియో లేరియా
3) ఐరన్ ఆక్సైడ్, రేడియో లేరియా
4) డయాటం, ఐరన్ ఆక్సైడ్
- View Answer
- సమాధానం: 1
44.‘ప్లైటో ప్లవకాల నిలయం’ అని ఏ సముద్రాన్ని పిలుస్తారు?
1) ఎర్ర సముద్రం
2) పసుపు సముద్రం
3) దక్షిణ సముద్రం
4) ఉత్తర సముద్రం
- View Answer
- సమాధానం: 4
45. సముద్రం అడుగు భాగంలో నివసించే జీవులను ఏమని పిలుస్తారు?
1) ప్లైటో ప్లవకాలు
2) జూ ప్లవకాలు
3) బెంథోస్
4) డయాటమ్
- View Answer
- సమాధానం: 3
46. పేలియోజిక్ నిక్షేపాల్లో ‘గ్లోబిజెరినా’ ఎంత శాతం ఉంటుంది?
1) 33%
2) 29%
3) 26.5%
4) 6.4%
- View Answer
- సమాధానం: 2
47.అటోల్ భిత్తికలు ఎక్కువగా ఏ మహాసముద్రంలో కనిపిస్తాయి?
1) పసిఫిక్
2) అట్లాంటిక్
3) హిందూ
4) ఆర్కిటిక్
- View Answer
- సమాధానం: 1
48. కింది వాటిలో తీరాంచల భిత్తిక రకానికి చెందిన దీవి ఏది?
1) ఫిజి
2) మాల్దీవులు
3) లక్షదీవులు
4) గ్రేట్ బ్యారియర్ రీఫ్
- View Answer
- సమాధానం: 3
49. భూభాగం సాంద్రత, నీటి సాంద్రత కంటే ఎన్ని రెట్లు అధికంగా ఉంటుంది?
1) 5.6
2) 4.8
3) 3.2
4) 2.5
- View Answer
- సమాధానం:4
50. బేరింగ్ జలసంధి నుంచి ప్రవహించే శీతల ప్రవాహం ఏది?
1) లాబ్రడార్
2) ఓషియావో
3) గల్ఫ్‌స్ట్రీమ్
4) క్యానరీస్
- View Answer
- సమాధానం:2