నక్షత్రాల్లో ఏ వాయువు అధికంగా ఉంటుంది?
1. కింది వాటిలో భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది?
1) సూర్యుడు
2) బుధుడు
3) గురుడు
4) శని
- View Answer
- సమాధానం: 1
2. నక్షత్రాల్లో ఏ వాయువు అధికంగా ఉంటుంది?
1) హైడ్రోజన్
2) నియాన్
3) ఆర్గాన్
4) క్రిప్టాన్
- View Answer
- సమాధానం: 1
3. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది?
1) 24 రోజులు
2) 27 రోజులు
3) 30 రోజులు
4) 49 రోజులు
- View Answer
- సమాధానం: 2
4. సూర్యుని ఉపరితలం ఉష్ణోగ్రత ఎంత?
1) 6000°c
2) 4000°c
3) 4500°c
4) 3600°c
- View Answer
- సమాధానం: 1
5. నక్షత్రాలు స్వయం ప్రకాశాలు కావడానికి కారణం?
1) కేంద్రక సంలీన చర్య
2) అభికేంద్రక బలం
3) ద్విదావిచ్ఛిత్తి
4) అపసరణ
- View Answer
- సమాధానం: 1
6. మొదటిసారిగా భూమి గుండ్రంగా ఉన్నది అని తెలిపింది ఎవరు?
1) కోపర్నికస్
2) అరిస్టాటిల్
3) టాలమీ
4) ఎడ్విన్
- View Answer
- సమాధానం: 2
7. మొట్ట మొదటిసారిగా ప్రపంచంలో సూర్య కిరణాలు పడే దీవులు ఏవి?
1) వీలర్ దీవులు
2) లక్ష దీవులు
3) టోంగా దీవులు
4) మినికాయ్ దీవులు
- View Answer
- సమాధానం: 3
8. సూర్యునికి, భూమికి మధ్య ఉన్న సగటు దూరం ఎన్ని కిలోమీటర్లు?
1) 149.5 మిలియన్ కి.మీ
2) 141 మిలియన్ కి.మీ
3) 132 మిలియన్ కి.మీ
4) 120 మిలియన్ కి.మీ
- View Answer
- సమాధానం: 1
9. సూర్యకిరణాలు భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత?
1) 4 నిమిషాలు
2) 6 నిమిషాలు
3) 8 నిమిషాలు
4) 2 నిమిషాలు
- View Answer
- సమాధానం: 3
10. సూర్యునిలో ఎరుపు (లేదా) ఆరెంజ్ వర్ణపు భాగం (అరుణ వర్ణం) ఏయే సమయాల్లో కన్పిస్తుంది?
1) సాయంత్రం
2) ఉదయం
3) మధ్యాహ్నం
4) 1-2 సరైనవి
- View Answer
- సమాధానం: 4
11. సూర్యునిలో అత్యధిక ఉష్ణోగ్రత భాగాన్ని ఏమని పిలుస్తారు?
1) క్రోమోస్పియర్
2) కరోనా
3) ప్రోటోస్పియర్
4) 1 - 3 సరైనవి
- View Answer
- సమాధానం: 2
12.చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం?
1) 1 సెకను
2) 1.3 సెకన్లు
3) 6 సెకన్లు
4) 10 సెకన్లు
- View Answer
- సమాధానం: 2
13.భూమి గురుత్వాకర్షణ శక్తిలో చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ఎన్నో వంతు?
1) 1/10 వంతు
2) 1/16 వంతు
3) 1/12 వంతు
4) 1/20 వంతు
- View Answer
- సమాధానం: 2
14. కింది వాటిలో భూమికి ఉన్న ఉపగ్రహం ఏది?
1) చంద్రుడు
2) శుక్రుడు
3) శని
4) బుధుడు
- View Answer
- సమాధానం: 1
15. చంద్రుని పరిభ్రమణం, భ్రమణం చేయడానికి పట్టే కాలం ఎంత?
1) 27 1/2 రోజులు
2) 23 రోజులు
3) 22 రోజులు
4) 21 రోజులు
- View Answer
- సమాధానం: 1
16. చంద్రునిపై అపోలో-2 అంతరిక్ష నౌకను ఎప్పుడు ప్రయోగించారు?
1) 1964
2) 1969
3) 1962
4) 1960
- View Answer
- సమాధానం: 2
17. చంద్రయాన్ -1 ఉపగ్రహాన్ని చంద్రునిపైకి భారతదేశం ఏ సంవత్సరంలో ప్రయోగించింది?
1) 2008
2) 2012
3) 2009
4) 2007
- View Answer
- సమాధానం: 1
18. బ్లూ మూన్ అంటే?
1) ఒక నెలలో పది పౌర్ణములు ఏర్పడతాయి
2) ఒక నెలలో అరుదుగా రెండు పౌర్ణములు ఏర్పడతాయి
3) ఇది 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది
4) 2 - 3 సరైనవి
- View Answer
- సమాధానం: 4
19. భారతదేశంలో మొదటిసారిగా ఏ సంవత్సరం లో ‘బ్లూమూన్’ సంభవించింది?
1) 2005
2) 2006
3) 2007
4) 2011
- View Answer
- సమాధానం: 3
20. ప్రస్తుత కాలంలో ‘బ్లూమూన్’ ఎప్పుడు సంభవించింది?
1) 2018 జనవరి 1
2) 2018 ఫిబ్రవరి 2
3) 2018 మార్చి 20
4) 2018 జనవరి 10
- View Answer
- సమాధానం: 1
21.సూపర్ మూన్ అంటే?
1) చంద్రునికి, భూమికి మధ్య ఉన్న దూరం తగ్గటం వల్ల ఈ రెండు చాలా దగ్గర కావడాన్ని ‘సూపర్ మూన్ ’ అంటారు
2) భూమికి, చంద్రునికి దూరం పెరగటం వల్ల సూపర్ మూన్ ఏర్పడుతుంది
3) చంద్రునికి, సూర్యునికి దూరం ఎక్కువ ఉండటం
4) భూమికి, సూర్యునికి దూరం తగ్గడం
- View Answer
- సమాధానం: 1
22. కింది వారిలో ఎవరు ‘సూపర్ మూన్’ అని మొదటిసారిగా ఉపయోగించారు?
1) రిచర్డ్ నోలె
2) కోపర్నికస్
3) థామస్
4) లెమైట్రి
- View Answer
- సమాధానం: 1
23. కింది వాటిలో సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది?
1) భూమి
2) బుధుడు
3) శని
4) శుక్రుడు
- View Answer
- సమాధానం: 2
24. కింది వాటిలో ‘భూమికి సోదరి’ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
1) శుక్రుడు
2) కుజుడు
3) గురుడు
4) శని
- View Answer
- సమాధానం: 1
25. భారతదేశం ఏ గ్రహాన్ని అధ్యయనం చేయడానికి ‘మంగళయాన్’ను ప్రయోగించింది?
1) అంగారకుడు
2) గురుడు
3) శని
4) బుధుడు
- View Answer
- సమాధానం: 1
26. ‘రెడ్ ప్లానెట్’ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
1) శుక్రుడు
2) కుజుడు
3) శని
4) బుధుడు
- View Answer
- సమాధానం: 2
27. కింది వాటిలో బుధుడు గ్రహానికి సంబంధించి సరైనది ఏది?
1) ఇది అతి చిన్న గ్రహం
2) ఈ గ్రహంపై వాతావరణం లేదు
3) ఈ గ్రహంపై అధికంగా హీలియం ఉంది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
28. ‘సూర్యగ్రహణం’ గురించి కింది వాటిలో సరైన ది ఏది?
1) సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపైకి వచ్చినపుడు సూర్యుని కిరణాలు భూమిపై పడకుండా చంద్రుడు అడ్డు వచ్చినపుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది
2) సూర్యుడు, చంద్రుడు, బుధుడు మూడు ఒక సరళరేఖపైన ఉన్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది
3) చంద్రుడు, సూర్యుడు, గురుడు మూడు ఒకే సరళరేఖపైన ఉన్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది
4) 2 - 3 సరైనవి
- View Answer
- సమాధానం: 1
29. రేఖాంశాలను, అక్షాంశాలను ఎవరు గుర్తించారు?
1) అరిస్టాటిల్
2) హిప్పార్కస్
3) గెలీలియో
4) బెయిలీ
- View Answer
- సమాధానం: 2
30. అంతర్జాతీయ దినరేఖ అంటే?
1) 180ని రేఖాంశం
2) 0ని అక్షాంశం
3) 23బీని ఉత్తర అక్షాంశం
4) 90ని దక్షిణ అక్షాంశం
- View Answer
- సమాధానం: 1
31. కింది దేశాల్లో గ్రీనిచ్ రేఖ పోయే ప్రాంతాలేవి?
1) స్పెయిన్
2) బ్రిటన్
3) ఫ్రాన్స
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
32. భూమధ్యరేఖతో కలిపి మొత్తం ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి?
1) 191
2) 181
3) 170
4) 160
- View Answer
- సమాధానం: 2
33. జతపర చండి.
రాష్ట్రం సంవహన వర్షాలు
i) ఆంధ్రప్రదేశ్ a) చె ర్రీ బ్లోసమ్స్
ii) కర్ణాటక b) తొలకరి జల్లులు
iii) అస్సాం c) మ్యాంగో షావర్స
iv) కేరళ d) నార్వెస్టర్లు
1) i-b, ii-a, iii-d, iv-c
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-d, ii-a, iii-c, iv-b
- View Answer
- సమాధానం: 1
34. భారతదేశంలో నైరుతి రుతుపవనాలు మొదట తాకే ప్రాంతం?
1) ఆంధ్రప్రదేశ్
2) అండమాన్ దీవులు
3) లక్ష దీవులు
4) డయ్యూ డమన్ దీవులు
- View Answer
- సమాధానం: 2
35. ‘ఓజోన్ పొర’ ఏ ఆవరణంలో కేంద్రీకృతమై ఉంటుంది?
1) మీసో ఆవరణం
2) ట్రోపో ఆవరణం
3) స్ట్రాటో ఆవరణం
4) థర్మో ఆవరణం
- View Answer
- సమాధానం: 3
36.వాతావరణంలో అధికంగా ఉన్న వాయువు ఏది?
1) ఆక్సిజన్
2) నైట్రోజన్
3) ఆర్గాన్
4) క్రిప్టాన్
- View Answer
- సమాధానం: 2
37. అంతరిక్ష యాత్రికలు ఏ ఆవరణంలో ‘స్పేస్ వాక్’ చేస్తారు?
1) మీసో ఆవరణం
2) ఎక్సో ఆవరణం
3) ట్రోపో ఆవరణం
4) థర్మో ఆవరణం
- View Answer
- సమాధానం: 2
38. ‘రేడియో తరంగాలు’ ఏ ఆవరణంలో ఉంటాయి?
1) స్ట్రాటో ఆవరణం
2) మీసో ఆవరణం
3) ట్రోపో ఆవరణం
4) థర్మో ఆవరణం
- View Answer
- సమాధానం: 4
39. భూమిపై అత్యధిక వాతావరణ పీడనం నమోదయ్యే ప్రాంతం ఏది?
1) అగాటా
2) టోక్యో
3) లండన్
4) కెనడా
- View Answer
- సమాధానం: 1
40. వాతావరణ పీడనాన్ని ఏ పరికరంతో కొలుస్తారు?
1) భారమితి
2) రైనోగేజ్
3) అమ్మీటర్
4) ఆల్టు మీటర్
- View Answer
- సమాధానం: 1
41. కింది వాటిలో పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి?
1) నీటి ఆవిరి
2) ఎత్తు
3) ఉష్ణోగ్రత
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
42. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) టోక్యో
2) లండన్
3) జెనీవా
4) మాస్కో
- View Answer
- సమాధానం: 3
43. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) టోక్యో
2) లండన్
3) జెనీవా
4) మాస్కో
- View Answer
- సమాధానం: 2
44. ప్రపంచంలో అత్యధిక లవణీయత ఉన్న సరస్సు?
1) వాన్ సరస్సు
2) చిలకా సరస్సు
3) పులికాట్ సరస్సు
4) కొల్లేరు సరస్సు
- View Answer
- సమాధానం: 1
45. కింది వాటిలో సముద్ర చలనాలని వేటిని అంటారు?
1) ప్రవాహాలు
2) పోటు పాటులు
3) తరంగాలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
46. భూకేంద్రం వద్ద సుమారుగా ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లు ఉంటుంది?
1) 400°c
2) 6000°c
3) 500°c
4) 5000°c
- View Answer
- సమాధానం: 2
47. కింది పర్వాతాల్లో పురాతన ముడుత పర్వతాలు ఏవి?
1) ఆరావళి పర్వతాలు
2) వింధ్యా పర్వతాలు
3) సాత్పురా పర్వతాలు
4) అనైముడి
- View Answer
- సమాధానం: 1
48. కింది వాటిలో నవీన ముడుత పర్వతాలు ఏవి?
1) ఆల్ఫ్ పర్వతాలు
2) హిమాలయ పర్వతాలు
3) రాకీ పర్వతాలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
49. కింది వాటిలో అవశిష్ట పర్వతాలు ఏవి?
1) నీలగిరి కొండలు
2) తూర్పు కనుమలు
3) పశ్చిమ కనుమలు
4)పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
50. కింది వాటిలో అగ్ని పర్వతాలు ఏవి?
1) అట్లాస్ పర్వతం
2) మెకంజీ
3) జురా
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4