హరిశ్చంద్ర కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1. కింది వాటిలో ‘ట్రిపియన్ నైసర్గిక స్వరూపం’గా దేన్ని అభివర్ణిస్తారు?
1) దక్కన్ పీఠభూమి
2) ఉత్తర మైదానాలు
3) పశ్చిమ కనుమలు
4) తూర్పు కనుమలు
- View Answer
- సమాధానం: 3
2. హరిశ్చంద్ర కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) మహారాష్ట్ర
2) గుజరాత్
3) చత్తీస్గఢ్
4) అసోం
- View Answer
- సమాధానం: 1
3.కింది వాటిలో సరికాని జత ఏది?
1) అజంతా గుహలు – మహారాష్ట్ర
2) బాబు బుడాన్ కొండలు – అసోం
3) ఫళని కొండలు – తమిళనాడు
4) వావుల్ మలై శిఖరం – కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
4. నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం ఏది?
1) అనైముడి
2) ఉదక మండలం
3) దొడబెట్ట
4) కల్సూభాయ్
- View Answer
- సమాధానం: 3
5.పశ్చిమ కనుమలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఇవి ఉత్తరాన తపతి నది నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి
2) తూర్పు కనుమలతో పోలిస్తే వీటి ఎత్తు తక్కువ
3) ఇవి పీఠభూమి వైపు కంటే అరేబియా సముద్రం వైపు అధికంగా వాలి ఉంటాయి
4) ఇవి సుమారు 1600 కి.మీ. పొడవు విస్తరించి ఉన్నాయి
- View Answer
- సమాధానం: 2
6.జీవ వైవిధ్య ప్రాంతమైన ‘సైలెంట్ వ్యాలీ’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) కేరళ
2) కర్ణాటక
3) తమిళనాడు
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 1
7.దక్షిణ భారతదేశంలో అత్యంత ఎల్తైన రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) తెలంగాణ
3) గోవా
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
8.‘దిల్వారా దేవాలయం’ ఏ పర్వతాల్లో ఉంది?
1) వింధ్య పర్వతాలు
2) సాత్పూర పర్వతాలు
3) సహ్యాద్రి పర్వతాలు
4) ఆరావళి పర్వతాలు
- View Answer
- సమాధానం: 4
9. పశ్చిమ కనుమల్లో, ద్వీపకల్ప పీఠభూమిలో అతి ఎల్తైన శిఖరం ఏది?
1) గురుశికార్
2) అనైముడి
3) సారమతి
4) దూప్గఢ్
- View Answer
- సమాధానం: 2
10. అనైముడి శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది?
1) కర్ణాటక
2) కేరళ
3) తమిళనాడు
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
11. పర్వతాలు, ఎల్తైన శిఖరాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది?
1) ఆరావళి పర్వతాలు – గురుశికార్
2) అన్నామలై కొండలు – అనైముడి
3) సాత్పూర శ్రేణులు – దూప్గఢ్
4) రాజమహల్ కొండలు – సారమతి
- View Answer
- సమాధానం: 4
12. సాత్పూర శ్రేణులు ఏయే నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?
1) నర్మద, సోన్
2) నర్మద, తపతి
3) నర్మద, చంబల్
4) తపతి, చంబల్
- View Answer
- సమాధానం: 2
13. ‘గ్రానరీ ఆఫ్ కేరళ’ అని పిలిచే కనుమ ఏది?
1) బోర్ ఘాట్
2) థాల్ ఘాట్
3) బాల్ ఘాట్
4) పాల్ ఘాట్
- View Answer
- సమాధానం: 4
14. కొడైకెనాల్ వేసవి విడిది కేంద్రం ఏ కొండల్లో ఉంది?
1) ఫళని కొండలు
2) నీలగిరి కొండలు
3) అన్నామలై కొండలు
4) ఇలైమలై కొండలు
- View Answer
- సమాధానం: 1
15. వింధ్య పర్వతాలు, సాత్పూర పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది?
1) తపతి
2) నర్మద
3) సోన్
4) చంబల్
- View Answer
- సమాధానం: 2
16.సాత్పూర, అంజతా పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది?
1) తపతి
2) నర్మద
3) సబర్మతి
4) గోదావరి
- View Answer
- సమాధానం: 1
17. మౌంట్ అబూ వేసవి విడిది కేంద్రం ఏ పర్వతాల్లో ఉంది?
1) సాత్పూర పర్వతాలు
2) వింధ్య పర్వతాలు
3) సహ్యాద్రి పర్వతాలు
4) ఆరావళి పర్వతాలు
- View Answer
- సమాధానం: 4
18. ‘రూఫ్ ఆఫ్ ది సౌత్’ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) చత్తీస్గఢ్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
19. భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించే పర్వత శ్రేణులు ఏవి?
1) ఆరావళి పర్వతాలు
2) పశ్చిమ కనుమలు
3) వింధ్య, సాత్పూర పర్వతాలు
4) సహ్యాద్రి పర్వతాలు
- View Answer
- సమాధానం: 3
20. ‘క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్’ అని దేన్ని పిలుస్తారు?
1) మౌంట్ అబూ
2) ఊటీ
3) కొడైకెనాల్
4) పచ్మరి
- View Answer
- సమాధానం: 2
21. పచ్మరి వేసవి విడిది కేంద్రం ఏ కొండల్లో ఉంది?
1) మహాదేవ్ కొండలు
2) కైమోర్ శ్రేణులు
3) రాజమహల్ కొండలు
4) ఫళని కొండలు
- View Answer
- సమాధానం: 1
22. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఎక్కడ కలుసుకుంటాయి?
1) కార్డయమ్
2) షవరాయ్
3) ఫళని
4) నీలగిరి
- View Answer
- సమాధానం: 4
23.మైకాల్ పర్వత శ్రేణి ఎక్కడ వ్యాపించి ఉంది?
1) రాజస్థాన్
2) తమిళనాడు
3) హరియాణా
4) చత్తీస్గఢ్
- View Answer
- సమాధానం: 4
24. భారత ద్వీపకల్పంలో ‘సహ్యాద్రి పర్వత శ్రేణి’ అని పిలిచే పర్వత శ్రేణి ఏది?
1) పశ్చిమ కనుమలు
2) నీలగిరి పర్వతాలు
3) తూర్పు కనుమలు
4) సాత్పూర పర్వతాలు
- View Answer
- సమాధానం: 1
25. షవరాయ్ పర్వతాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?
1) కేరళ
2) కర్ణాటక
3) తమిళనాడు
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 3
26. హిమాలయ పర్వత వ్యవస్థ ఏ యుగానికి చెందింది?
1) పూర్వ కేంబ్రియన్
2) పేలియోజోయిక్
3) మీసోజోయిక్
4) టెర్షియరీ
- View Answer
- సమాధానం: 4
27. ఉత్కళ మైదానంలో ఉన్న ప్రముఖ డెల్టా ఏది?
1) పెన్నా
2) కావేరి
3) మహానది
4) గంగానది
- View Answer
- సమాధానం: 3
28.జతపరచండి.
తీరం రాష్ట్రం
i. సర్కార్ తీరం a. పశ్చిమ బెంగాల్
ii. వంగ తీరం b. ఒడిశా
iii. కోరమాండల్ తీరం c.ఆంధ్రప్రదేశ్
iv. ఉత్కళ తీరం d. తమిళనాడు
1) 1-b, ii-c, iii-d, iv-a
2) 1-c, ii-b, iii-d, iv-a
3) 1-c, ii-a, iii-b, iv-d
4) 1-c, ii-a, iii-d, iv-b
- View Answer
- సమాధానం: 4
29. దివైర్, దేసూరి, పిప్లిఘాట్ తదితర కనుమలు ఏ పర్వత శ్రేణుల్లో ఉన్నాయి?
1) పశ్చిమ కనుమలు
2) తూర్పు కనుమలు
3) ఆరావళి పర్వతాలు
4) వింధ్య, సాత్పూర పర్వతాలు
- View Answer
- సమాధానం: 3
30. థాల్ఘాట్, బోర్ఘాట్, పాల్ఘాట్ తదితర కనుమలు ఏ పర్వతాల్లో ఉన్నాయి?
1) వింధ్య పర్వతాలు
2) సాత్పూర శ్రేణులు
3) పశ్చిమ కనుమలు
4) తూర్పు కనుమలు
- View Answer
- సమాధానం: 3
31. కల్సూభాయ్ శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది?
1) మహారాష్ట్ర
2) కేరళ
3) కర్ణాటక
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
32. కేరళలో నీలగిరి కొండల తర్వాత విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలను ఏమంటారు?
1) బూబు బుడాన్ కొండలు
2) ఇలైమలై పర్వతాలు
3) పంచమలై కొండలు
4) కైమూర్ పర్వత శ్రేణి
- View Answer
- సమాధానం: 2
33. కింది వాటిలో అతి పురాతన ముడుత పర్వతాలు ఏవి?
1) హిమాలయాలు
2) ఆరావళి పర్వతాలు
3) పశ్చిమ కనుమలు
4) వింధ్య పర్వతాలు
- View Answer
- సమాధానం: 2
34. ‘గౌరీ శంకర్’ శిఖరం ఏ పర్వతాల్లో ఉంది?
1) హిమాలయాలు
2) సహ్యాద్రి పర్వతాలు
3) తూర్పు కనుమలు
4) సాత్పూర పర్వతాలు
- View Answer
- సమాధానం: 1
35. భారతదేశంలోనే ఎల్తైన జోగ్/జొరసొప్పా’ జలపాతం ఏ నదిపై ఉంది?
1) కావేరి నది
2) శివసముద్రం
3) జోగ్ నది
4) శరావతి
- View Answer
- సమాధానం: 4
36. తూర్పు కనుమలు ఏ శిలలతో ఏర్పడ్డాయి?
1) బసాల్ట్, నీస్
2) గ్రానైట్, బసాల్ట్
3) ఖొండాలైట్, షిస్ట్
4) ఖొండాలైట్, చార్నోకైట్
- View Answer
- సమాధానం: 4
37. కింది వాటిలో సరికాని జత ఏది?
1) మెరీనా బీచ్ – తమిళనాడు
2) కోవలం బీచ్ – కేరళ
3) మైపాడు బీచ్ – ఆంధ్రప్రదేశ్
4) గంగాసాగర్ బీచ్ – గుజరాత్
- View Answer
- సమాధానం: 4
38. కింది వాటిలో తమిళనాడుకు చెందని కొండలు ఏవి?
1) జువ్వాది కొండలు
2) మైకాల పర్వతాలు
3) గొండుమలై కొండలు
4) పంచమలై కొండలు
- View Answer
- సమాధానం: 2
39.కేరళలోని తీరాన్ని ఏమంటారు?
1) కెనరా తీరం
2) కొంకణ్ తీరం
3) మలబార్ తీరం
4) చోళ తీరం
- View Answer
- సమాధానం: 3
40. అష్టముడి, వెంబనాడ్ సరస్సులు ఏ తీరంలో ఉన్నాయి?
1) కోరమండల్
2) కొంకణ్
3) మలబార్
4) వంగ
- View Answer
- సమాధానం: 3
41.ఆటుపోటులకు ప్రసిద్ధి చెందిన మైదానం?
1) ఉత్కళ మైదానం
2) గుజరాత్ మైదానం
3) కొంకణ్ మైదానం
4) కేరళ మైదానం
- View Answer
- సమాధానం: 2
42. మహారాష్ట్రలోని తీర మైదానాన్ని ఏమని పిలుస్తారు?
1) మలబార్ మైదానం
2) వంగ మైదానం
3) కొంకణ్ మైదానం
4) రాణ్ ఆఫ్ కచ్ మైదానం
- View Answer
- సమాధానం: 3
43.లూగూన్లు, కాయల్స్కు ప్రసిద్ధి చెందిన తీరం ఏది?
1) మలబార్ తీరం
2) ఉత్కళ తీరం
3) కొంకణ్ తీరం
4) వంగ తీరం
- View Answer
- సమాధానం: 1
44. దక్కన్ పీఠభూమికి, కొంకణ్ మైదానానికి మధ్య ఉన్న ముఖ్యమైన దారులు ఏవి?
1) థాల్ఘాట్, పాల్ఘాట్
2) పాల్ఘాట్, పెన్కోట్లై ఖాళీ ప్రదేశం
3) పాల్ఘాట్, బోర్ఘాట్
4) బోర్ఘాట్, థాల్ఘాట్
- View Answer
- సమాధానం: 4
45. మహారాష్ట్రలో అతి ఎల్తైన గిరి విహార స్థలం ఏది?
1) పంచ్గని
2) మహాబలేశ్వర్
3) మతేరాన్
4) చికల్ఠానా
- View Answer
- సమాధానం: 2
46. మలబార్ తీరంలోని వెనక జలాలను ఏమని పిలుస్తారు?
1) కౌర్స్
2) థరియన్
3) కాయల్స్
4) కోస్
- View Answer
- సమాధానం: 3
47. కళింగ తీర మైదానం ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది?
1) పశ్చిమ బెంగాల్
2) ఆంధ్ర ప్రదేశ్
3) ఒడిశా
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
48. కింది వాటిలో తూర్పు కనుమలకు చెందని కొండలు ఏవి?
1) పంచమలై కొండలు
2) షెవరాయ్ కొండలు
3) పాల కొండలు
4) ఫళని కొండలు
- View Answer
- సమాధానం: 4
49. ‘నిమజ్జిత తీరం’ అని దేన్ని పిలుస్తారు?
1) రాణ్ ఆఫ్ కచ్ తీరం
2) కోరమండల్ తీరం
3) మలబార్ తీరం
4) కొంకణ్ తీరం
- View Answer
- సమాధానం: 3
50. బసాల్ట్ నేలలకు ప్రసిద్ధి చెందిన తీర మైదానం ఏది?
1) కొంకణ్ మైదానం
2) కెనరా మైదానం
3) మలబార్ మైదానం
4) వంగ మైదానం
- View Answer
- సమాధానం: 1
51. యాలకుల కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?
1) కర్ణాటక
2) గోవా
3) కేరళ
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
52. పశ్చిమ కనుమలు.. నీలగిరి కొండలను ఏ ప్రాంతంలో కలుస్తాయి?
1) గూడూరు
2) గుడలూరు
3) కొడైకెనాలు
4) కన్యాకుమారి
- View Answer
- సమాధానం: 2
53. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో లభించే ముఖ్యమైన మృత్తిక ఏది?
1) జేగురు మృత్తికలు
2) ఒండ్రు మృత్తికలు
3) ఊబి మృత్తికలు
4) నల్లరేగడి మృత్తికలు
- View Answer
- సమాధానం: 4
54. ఎర్ర మృత్తికల్లో ఏ మూలకం ఉండటం వల్ల అవి ఎరుపు రంగులో కనిపిస్తాయి?
1) పొటాషియం ఆక్సైడ్
2) ఐరన్ ఆక్సైడ్
3) మెగ్నీషియం ఆక్సైడ్
4) ట్రోజన్ ఆక్సైడ్
- View Answer
- సమాధానం: 2
55. రూపాంతర ప్రాప్తి శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడిన మృత్తికలు ఏవి?
1) నల్లరేగడి మృత్తికలు
2) ఒండ్రు మృత్తికలు
3) ఎర్ర మృత్తికలు
4) లాటరైట్ మృత్తికలు
- View Answer
- సమాధానం: 3
56. నదీలోయకు దూరంగా ఉండే పురాతన సారవంతమైన నేలలను ఏమని పిలుస్తారు?
1) టెరాయి
2) భంగర్
3) భాబర్
4) కంకర్
- View Answer
- సమాధానం: 2
57. పత్తి పంటకు ప్రసిద్ధి చెందిన మృత్తికలు ఏవి?
1) ఎర్ర మృత్తికలు
2) లాటరైట్ మృత్తికలు
3) అటవీ మృత్తికలు
4) నల్లరేగడి మృత్తికలు
- View Answer
- సమాధానం: 4
58.లాటరైట్ మృత్తికలకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) వీటిని జేగురు నేలలు అని కూడా పిలుస్తారు
2) ఇవి అధిక ఉష్ణోగ్రత, అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఏర్పడతాయి
3) ఈ మృత్తికలు అల్యూమినియం, బసాల్ట్లు ఉన్న శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడతాయి
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
59. బసాల్ట్ శిల విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడిన నేలలు ఏవి?
1) నల్లరేగడి నేలలు
2) లాటరైట్ నేలలు
3) ఎర్ర నేలలు
4) శుష్క నేలలు
- View Answer
- సమాధానం: 1
60. భారతదేశంలోని ‘నల్ల రేగడి భూమి’ ఏ సముదాయానికి చెందింది?
1) ఒండలి
2) లాటరైట్
3) పోడ్జల్
4) చెర్నోజెమ్
- View Answer
- సమాధానం: 4
61. ‘భారతదేశ ధాన్యాగారాలు’ అని ఏ నేలలను పిలుస్తారు?
1) నల్లరేగడి నేలలు
2) ఒండ్రుమట్టి నేలలు
3) జేగురు నేలలు
4) ఎర్ర నేలలు
- View Answer
- సమాధానం: 2
62. ఎర్ర మృత్తికలకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలు ఏవి?
ఎ) ఈ మృత్తికల్లో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఆక్సైడ్లాంటి మూలకాలు అత్యధికంగా ఉంటాయి
బి) ఇవి గాలి పారేటట్లుగా ఉంటాయి
ఎ) ఈ మృత్తికల్లో నత్రజని, ఫాస్పారిక్ ఆమ్లం, సేంద్రియ పదార్థాలు తక్కువగా ఉంటాయి
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4