భారతదేశంలో తోట వ్యవసాయాన్ని ప్రవేశ పెట్టిన విదేశీయులు ఎవరు?
1. భారతదేశంలో తోట వ్యవసాయాన్ని ప్రవేశ పెట్టిన విదేశీయులు ఎవరు?
1) పర్షియన్లు
2) పోర్చుగీసువారు
3) బ్రిటిషర్లు
4) అరబ్బులు
- View Answer
- సమాధానం: 3
2. మనదేశంలో విస్థాపన వ్యవసాయానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఆంధ్రప్రదేశ్ - పోడు వ్యవసాయం
2) మధ్యప్రదేశ్ - బేవార్
3) అసోం - కురువా
4) కేరళ - పోనమ్
- View Answer
- సమాధానం: 3
3. విస్తృత వ్యవసాయానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ) ఈ వ్యవసాయ పద్ధతికి భూకమతం ఎక్కువగా ఉండాలి
బి) ఈ పద్ధతికి జనసాంద్రత తక్కువగా ఉండాలి
సి) ఈ పద్ధతిలో నీటిపారుదల ఎక్కువగా, యంత్రాల వినియోగం తక్కువగా ఉండాలి
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 1
4. భూకమత పరిమాణం తక్కువగా ఉండి, జనసాంద్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో యాంత్రీకరణ లేకుండా చేసే వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు?
1) మిశ్రమ వ్యవసాయం
2) జీవనాధార వ్యవసాయం
3) సాంద్ర వ్యవసాయం
4) విస్తృత వ్యవసాయం
- View Answer
- సమాధానం: 3
5. కింది వాటిలో తోట పంట కానిది ఏది?
1) రబ్బరు
2) టీ
3) కొబ్బరి
4) జనుము
- View Answer
- సమాధానం: 4
6. వివిధ పరిశోధన కేంద్రాలు, అవి ఉన్న ప్రదేశాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ప్రపంచ వరి పరిశోధన కేంద్రం - మనీలా (ఫిలిప్పీన్స)
2) జాతీయ వరి పరిశోధన కేంద్రం - కోల్కతా
3) భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం - న్యూఢిల్లీ
4) భారత చెరకు విత్తన పరిశోధన కేంద్రం - కోయంబత్తూర్
- View Answer
- సమాధానం: 2
7. గోధుమ పంటకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) ఇది సమశీతోష్ణ మండలం పంట
బి) ఇది రెండో ప్రధాన ఆహార పంట
సి) ఇది ఖరీఫ్ కాలానికి చెందిన పంట
1) ఎ, బి
2) ఎ, సి
3) బి, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 1
8. భారతదేశంలో గోధుమను అత్యధికంగా ఉత్పత్తి చేసే మొదటి రెండు రాష్ట్రాలు వరసగా?
1) హర్యానా, పంజాబ్
2) పంజాబ్, హర్యానా
3) హర్యానా, ఛత్తీస్గఢ్
4) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
9. భారతదేశంలో వరిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) పశ్చిమబెంగాల్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
10. హరిత విప్లవానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ) హరిత విప్లవం అనే పదాన్ని మొదట ఉపయోగించిన వ్యక్తి ‘విలియం. ఎస్ గాడ్’
బి) హరిత విప్లవాన్ని మొదటిసారిగా ప్రపంచంలో వ్యాప్తి చేసిన వారు ‘నార్మన్ బోర్లాగ్’
సి) భారతదేశంలో హరిత విప్లవాన్ని అధికంగా వ్యాప్తి చేసినవారు ఎం.ఎస్. స్వామినాథన్
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
11. కింది వాటిని జతపరచండి.
జాబితా - I జాబితా - II
i) క్షీర విప్లవం a) పండ్లు
ii) వెండి విప్లవం b) చేపలు
iii) బంగారు విప్లవం c) పాలు
iv) నీలి విప్లవం d) కోడి గుడ్లు
1) i-c, ii-a, iii-d, iv-b
2) i-d, ii-c, iii-a, iv-b
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-b, ii-d, iii-a, iv-c
- View Answer
- సమాధానం: 3
12.హరిత విప్లవం వల్ల మన దేశంలో అత్యధికంగా ప్రయోజనం పొందిన పంట ఏది?
1) వరి
2) మొక్కజొన్న
3) జొన్న
4) గోధుమ
- View Answer
- సమాధానం: 4
13. కింది వాటిలో ‘గోల్డెన్ ఫైబర్’ లేదా ‘బంగారు పీచు’ అని దేన్ని పిలుస్తారు?
1) జనుము
2) పత్తి
3) పొగాకు
4) సుగంధ ద్రవ్యాలు
- View Answer
- సమాధానం: 1
14. పత్తి పంటకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) దీన్ని ‘తెల్ల బంగారం’ అని పిలుస్తారు
2) పత్తిని అత్యధికంగా నల్లరేగడి నేలలో పండిస్తారు
3) దేశంలో అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
15. భారతదేశంలో ‘ఇంద్రధనస్సు విప్లవం’ను దేనిలో భాగంగా ప్రకటించారు?
1) మొదటి హరిత విప్లవం
2) రెండో హరిత విప్లవం
3) జాతీయ వ్యవసాయ విధానం - 2000
4) జాతీయ వ్యవసాయ విధానం - 2006
- View Answer
- సమాధానం: 3
16. మొదటి హరిత విప్లవం వల్ల దేశంలో తక్కువ ప్రయోజనం పొందిన పంట ఏది?
1) పప్పుధాన్యాలు
2) నూనె గింజలు
3) మొక్కజొన్న
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
17. దేశంలో పంటలు, వాటిని అత్యధికంగా పండించే రాష్ట్రాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
జాబితా - I జాబితా - II
i) సజ్జలు a) కర్ణాటక
ii) రాగులు b) మహారాష్ట్ర
iii) జొన్న c) రాజస్థాన్
1) i-c, ii-b, iii-a
2) i-c, ii-a, iii-b
3) i-a, ii-b, iii-c
4) i-b, ii-a, iii-c
- View Answer
- సమాధానం: 2
18. బీరు, విస్కీ తయారీలో ఏ పంట గింజలను ఉపయోగిస్తారు?
1) బార్లీ
2) సజ్జ
3) రాగులు
4) సామలు
- View Answer
- సమాధానం: 1
19. 1965-66లో హరిత విప్లవాన్ని మొదటి సారిగా ఏ ప్రాంతంలో ప్రవేశపెట్టారు?
1) పంజాబ్
2) హర్యానా
3) పశ్చిమ ఉత్తరప్రదేశ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
20. రెండో హరిత విప్లవానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ) దీన్ని 2006 మే 26న అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రకటించారు
బి) ఇది పప్పుధాన్యాల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి సరైనవి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
21. మనదేశంలో ‘సతత హరిత విప్లవం’ను ఎవరు ప్రకటించారు?
1) మన్మోహన్ సింగ్
2) ఎం.ఎస్. స్వామినాథన్
3) ఇందిరాగాంధీ
4) వర్గీస్ కురియన్
- View Answer
- సమాధానం: 2
22. చెరకు పంట పూర్తి పరిపక్వానికి చేరడానికి ఎంతకాలం పడుతుంది?
1) 6 నెలలు
2) 10 నెలలు
3) 12 నెలలు
4) 18 నెలలు
- View Answer
- సమాధానం: 3
23. కింది వాటిని జతపరచండి.
జాబితా - I జాబితా - II
i) హరిత విప్లవం a) చమురు
ii) గ్రే విప్లవం b) నూనె గింజలు
iii) పసుపు విప్లవం c) ఎరువులు
iv) బ్లాక్ విప్లవం d) ఆహారధాన్యాలు
1) i-b, ii-a, iii-d, iv-c
2) i-d, ii-a, iii-b, iv-c
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-d, ii-c, iii-a, iv-b
- View Answer
- సమాధానం: 3
24. ప్రస్తుతం భారతదేశంలో కాఫీని అధికంగా ఎక్కడ సాగు చేస్తున్నారు?
1) బాబుబుడాన్ కొండలు
2) డార్జిలింగ్ లోయ
3) నీలగిరి కొండలు
4) శివాలిక్ శ్రేణులు
- View Answer
- సమాధానం: 1
25. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ) 17వ శతాబ్దంలో బాబాబుడాన్ అనే వ్యక్తి మనదేశంలో కాఫీ పంటను ప్రవేశపెట్టారు
బి) తేయాకును మొదటిసారి అసోంలో సాగు చేశారు
సి) భారతదేశంలో రబ్బరును తొలిసారిగా కేరళలో సాగు చేశారు
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
26. కింది వాటిని జతపరచండి.
జాబితా - I
i) ఎపికల్చర్
ii) ఆర్బోరి కల్చర్
iii) సెరికల్చర్
iv) పిసికల్చర్
జాబితా - II
a) చేపల పెంపకం
b) తేనెటీగల పెంపకం
c) కూరగాయలు, మొక్కలపెంపకం
d) పట్టుపురుగుల పెంపకం
1) i-d, ii-a, iii-b, iv-c
2) i-b, ii-a, iii-d, iv-c
3) i-b, ii-c, iii-d, iv-a
4) i-b, ii-d, iii-c, iv-a
- View Answer
- సమాధానం: 3
27. భారతదేశంలో రబ్బరును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది?
1) అసోం
2) కర్ణాటక
3) కేరళ
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
28. పట్టు ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1) కేరళ
2) రాజస్థాన్
3) తమిళనాడు
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
29. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) శ్వేత విప్లవ పితామహుడు - వర్గీస్ కురియన్
బి) ఆపరేషన్ ఫ్లడ్ - 1970
సి) శ్వేత విప్లవం - నూనెగింజల ఉత్పత్తి
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 1
30. తేయాకు పంటకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఈ పంట సాగు చేయడానికి కావలసిన ఉష్ణోగ్రత 20°c -30°c
2) పంటకు కావలసిన వర్షపాతం 150 సెం.మీ. - 300 సెం.మీ.
3) ఈ పంట ఉత్పత్తికి పొగమంచు హానికరం
4) దీనికి ఎల్లప్పుడు నీరు నిల్వ ఉండాలి
- View Answer
- సమాధానం: 4
31. కింది వాటిని జతపరచండి.
జాబితా - I జాబితా - II
i) ఎరుపు విప్లవం a) బంగాళాదుంపలు
ii) బ్రౌన్ విప్లవం b) రొయ్యలు
iii) రౌండ్ విప్లవం c) మాంసం
iv) గులాబీ విప్లవం d) సుగంధ ద్రవ్యాలు
1) i-c, ii-d, iii-a, iv-b
2) i-d, ii-c, iii-a, iv-b
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-b, ii-d, iii-a, iv-c
- View Answer
- సమాధానం: 1
32. దేశంలో చెరకును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు ఏవి?
1) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్, రాజస్థాన్
3) ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర
4) పశ్చిమ బెంగాల్, బిహార్
- View Answer
- సమాధానం: 3
33. భారతదేశంలో ఏయే రాష్ట్రాలను ‘గోధుమ ధాన్యాగారాలు’ అని పిలుస్తారు?
ఎ) ఉత్తరప్రదేశ్
బి) మధ్యప్రదేశ్
సి) పంజాబ్
డి) హర్యానా
1) ఎ, బి, సి
2) బి, సి, డి
3) ఎ, సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 3
34. దేశంలో సుగంధ ద్రవ్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది?
1) రాజస్థాన్
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) గోవా
- View Answer
- సమాధానం: 2
35. అత్యంత శ్రేష్టమైన సువాసన కలిగిన ‘టీ’ తోటలు ఏ ప్రాంతంలో ఉన్నాయి?
1) అసోంలోని టోక్లాయ్
2) ఆంధ్రప్రదేశ్లోని అరకులోయ
3) కర్ణాటకలోని బాబుబుడాన్ కొండలు
4) డార్జిలింగ్ ప్రాంతం
- View Answer
- సమాధానం: 4
36. వ్యవసాయంతోపాటు పశుపోషణ, కోళ్ల పెంపకంతో కలిపి చేసే వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు?
1) విస్తృత వ్యవసాయం
2) మిశ్రమ వ్యవసాయం
3) విస్థాపన వ్యవసాయం
4) సాంద్ర వ్యవసాయం
- View Answer
- సమాధానం: 2
37. కింద పేర్కొన్న ఏ వ్యవసాయ పద్ధతికి పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం, భూమి ఎక్కువగా అవసరం ఉంటాయి?
1) విస్తృత వ్యవసాయం
2) పోడు వ్యవసాయం
3) తోట వ్యవసాయం
4) సాంద్ర వ్యవసాయం
- View Answer
- సమాధానం: 3
38. కింది వాటిని జతపరచండి.
జాబితా - I
i) కేంద్రీయ పత్తి పరిశోధన కేంద్రం
ii) భారత చెరకు పరిశోధన సంస్థ
iii) సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రం
iv) తేయాకు పరిశోధన కేంద్రం
జాబితా - II
a) జోర్హట్
b) నాగపూర్
c) లక్నో
d) కాలికట్
1) i-c, ii-d, iii-a, iv-b
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-b, ii-a, iii-d, iv-c
4) i-b, ii-c, iii-d, iv-a
- View Answer
- సమాధానం: 4
39. భారతదేశంలో జనుమును అధికంగా ఏ ప్రాంతంలో సాగు చేస్తున్నారు?
1) కావేరి నదీపరివాహక ప్రాంతం
2) కృష్ణా - గోదావరి డెల్టా ప్రాంతం
3) బ్రహ్మపుత్రా నదీలోయ ప్రాంతం
4) హుగ్లీ నదీపరివాహక ప్రాంతం
- View Answer
- సమాధానం: 4
40. దేశంలో ఉన్నిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
1) కేరళ
2) రాజస్థాన్
3) ఆంధ్రప్రదేశ్
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 2
41. కింది వాటిని జతపరచండి.
జాబితా - I
i) ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ ఇన్స్టిట్యూట్
ii) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రీసెర్చ
iii) కేంద్ర సముద్ర చేపల పరిశోధన సంస్థ
iv) నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ
జాబితా - II
a) ఆనంద్
b) కొచ్చిన్
c) ఢిల్లీ
d) కాన్పూర్
1) i-c, ii-d, iii-b, iv-a
2) i-c, ii-a, iii-d, iv-b
3) i-d, ii-c, iii-a, iv-b
4) i-b, ii-c, iii-d, iv-a
- View Answer
- సమాధానం: 1