ఒక్క రూపాయి నోటుపై ఎవరి సంతకం ఉంటుంది?
1. జతపరచండి.
జాబితా - I
i) రెపో
ii) రివర్స రెపో
iii) సి.ఆర్.ఆర్.
iv) బ్యాంక్ రేట్
జాబితా - II
a) రీ డిస్కౌంట్ రేట్
b) వాణిజ్య బ్యాంకులకు స్వల్ప కాలానికి ఇచ్చే రుణాలపై ఆర్బీఐ విధించే వడ్డీరేటు
c) ఆర్బీఐకి ఇచ్చిన రుణాలపై వాణిజ్య బ్యాంకులు పొందే వడ్డీరేటు
d) వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న మొత్తం డిపాజిట్లలో కొంత నిష్పత్తిని ఆర్బీఐ వద్ద ఉంచడం
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-c, iii-d, iv-a
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-c, ii-b, iii-d, iv-a
- View Answer
- సమాధానం: 2
2. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) చిన్న పరిశ్రమలకు పాధాన్యమిచ్చిన పారిశ్రామిక తీర్మానం - 1977
బి) భారత ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొన్న పారిశ్రామిక తీర్మానం - 1956
సి) ‘ఆర్థిక ఫెడరలిజం, న్యూక్లియస్ ప్లాంట్’లాంటి భావనలను ప్రవేశపెట్టింది - 1948 పారిశ్రామిక తీర్మానం
డి) ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థను అనుసంధానం చేయడం - 1991 నూతన పారిశ్రామిక తీర్మానం
1) ఎ, బి
2) సి, డి
3) ఎ, బి, సి
4) ఎ, బి, డి
- View Answer
- సమాధానం: 4
3. నీతి ఆయోగ్‌కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఇది సలహా సంస్థ. Think Tank లాంటిది
2) విధులను కేటాయించే అధికారం లేదు
3) కాలానుగుణంగా అవసరాలను బట్టి తాత్కాలికంగా సభ్యులను ప్రణాళికా సంఘంలా నియమించుకోవడానికి వీలులేదు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
4. కింది వాటిలో సరికాని జత ఏది?
1) 1952 - కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభం
2) 1953 - జాతీయ విస్తరణ సేవల పథకం
3) 1954 - నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభం
4) 1955 - ఎస్బీఐ జాతీయీకరణ
- View Answer
- సమాధానం: 3
5. జతపరచండి.
జాబితా - I
i) వెల్త్ ఆఫ్ నేషన్స్
ii) ది స్టేజస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్
iii) ది స్ట్రాటజీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్
iv) ఏసియన్ డ్రామా
జాబితా - II
a) గున్నార్ మిర్ధాల్
b) హర్షిమన్
c) రోస్ట్రోవ్
d) ఆడమ్ స్మిత్
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-c, iii-d, iv-a
3) i-d, ii-b, iii-c, iv-a
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 4
6. ప్రతిపాదన (A): 1914 - 47 మధ్య రెండు ప్రపంచ యుద్ధాలు.. ఆర్థికమాంద్యం, దేశ విభజన వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి
కారణం (R): ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక విధానాల్లో మార్పులు చేపట్టింది
1) A, R లు సరైనవి, అకు ఖ సరైన వివరణ
2) A, R లు సరైనవి, అకు ఖ సరైన వివరణ కాదు
3) A సరైంది, R సరికాదు
4) A సరైంది కాదు, R సరైంది
- View Answer
- సమాధానం: 1
7. కింది వాటిలో సరికాని జత?
1) పారిశ్రామిక విత్త సంస్థల్లో శిఖరాగ్ర సంస్థ - ఐడీబీఐ (1964)
2) గ్రామీణ వ్యవసాయ పరపతిలో శిఖరాగ్ర సంస్థ - నాబార్డ (1982)
3) గృహ నిర్మాణ రంగంలో శిఖరాగ్ర సంస్థ- ఎన్‌హెచ్‌బీ - (1988)
4) చిన్న పరిశ్రమలకు విత్తాన్ని అందించే శిఖరాగ్ర సంస్థ - ఎస్ఐడీబీఐ (1991)
- View Answer
- సమాధానం: 4
8. 1980 వరకు 3.5%గా ఉన్న వృద్ధిరేటును హిందూ వృద్ధిరేటుగా వ్యాఖ్యానించిన వారెవరు?
1) రాజా చెల్లయ్య
2) నరసింహం
3) దుగ్గల్
4) ప్రొఫెసర్ రాజ్‌కృష్ణ
- View Answer
- సమాధానం: 4
9. జతపరచండి.
జాబితా - I
i) హిందూ వృద్ధిరేటు
ii) ఎల్పీజీ నమూనా
iii) PURA నమూనా
iv) వేతన వస్తు నమూనా
జాబితా - II
a) ఎ.పి.జె. అబ్దుల్ కలాం
b) ప్రొఫెసర్ రాజ్‌కృష్ణ
c) వకీల్, బ్రహ్మానందం
d) డాక్టర్ మన్మోహన్ సింగ్
1) i-b, ii-d, iii-a, iv-c
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-b, ii-d, iii-c, iv-a
4) i-b, ii-c, iii-a, iv-d
- View Answer
- సమాధానం: 1
10. కింది వాటిలో సరికానిది ఏది?
1) ఎం.ఎస్. స్వామినాథన్ అధ్యక్షతన 2004లో జాతీయ రైతు కమిషన్‌ను నియమించారు
2) మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2006లో రెండో హరిత విప్లవానికి పిలుపునిచ్చారు
3) వర్గీస్ కురియన్ ఆధ్వర్యంలో ఎవర్గ్రీన్ రివల్యూషన్‌కు శ్రీకారం చుట్టారు
4) భారత్‌లో తొలి జాతీయ వ్యవసాయ విధానాన్ని 1993లో ప్రకటించారు
- View Answer
- సమాధానం: 3
11. ప్రతిపాదన (A): 1969 జూలై 19న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దృఢ సంకల్పంతో 14 షెడ్యూల్ బ్యాంక్‌లను జాతీయం చేశారు
కారణం (R): త్వరితగతిన సామాజిక, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్థను పురికొల్పడానికి జాతీయీకరణ తక్షణ అవసరమని భారత ప్రభుత్వం భావించింది
1) A సరైంది, R సరికాదు
2) A, R లు సరైనవి, Aకు R సరైన వివరణ
3) A, R రెండూ సరికావు
4) A సరైంది కాదు, R సరైంది
- View Answer
- సమాధానం: 2
12. 2011 జనాభా లెక్కలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) దేశ జనసాంద్రత - 384
2) అత్యధిక జనాభా వృద్ధిరేటు నమోదైన రాష్ట్రం - మేఘాలయ (27.9%)
3) రుణాత్మక జనాభా వృద్ధిరేటు నమోదైన రాష్ట్రం - నాగాలాండ్ (-0.6%)
4) అత్యధిక అక్షరాస్యులు ఉన్న రాష్ట్రం - ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
13. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ప్రస్తుతం జాతీయ ఆదాయంలో అత్యధిక వాటాను అందించే రంగం - సేవారంగం
బి) ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అధిక వాటానందించేది - ప్రైవేట్ రంగం
సి) విదేశీ వ్యాపారం లేని ఆర్థిక వ్యవస్థ - క్లోస్డ్ ఎకానమీ లేదా అటార్కీ
డి) జాతీయాదాయ కమిటీ (1949) అధ్యక్షుడు - పి.సి. మహలనోబిస్
1) ఎ, బి, సి
2) బి, సి, డి
3) ఎ, బి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
14. జతపరచండి.
జాబితా - I
i) నరసింహం కమిటీ
ii) మల్హోత్రా కమిటీ
iii) పద్మనాభన్ కమిటీ
iv) రాజా చెల్లయ్య
జాబితా - II
a) పన్ను రంగంలో సంస్కరణలు
b) బ్యాంకుల పర్యవేక్షణ
c) బీమా పరిశ్రమలో సంస్కరణలు
d) బ్యాంకింగ్ రంగం సంస్కరణలు, విత్తరంగం సంస్కరణలు
1) i-b, ii-a, iii-c, iv-d
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-d, ii-a, iii-b, iv-c
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 4
15. కింది వాటిలో సరికానిది ఏది?
1) భారతదేశంలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది - జేమ్స్ విల్సన్
2) స్వతంత్ర భారత తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది - షణ్ముఖం శెట్టి
3) జీఎస్టీ కౌన్సిల్‌కు చైర్మన్‌గా వ్యవహరించేది - ప్రధానమంత్రి
4) గణతంత్ర భారత తొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది - జాన్ మతాయ్
- View Answer
- సమాధానం: 3
16. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) పాకే దవ్యోల్బణం - ధరల స్థాయిలో సంవత్సరానికి 3% కంటే తక్కువ పెరుగుదల ఉంటుంది
బి) నడిచే ద్రవ్యోల్బణం - సంవత్సరంలో 4% నుంచి 5% ధరలు పెరుగుతాయి
సి) పరిగెత్తే ద్రవ్యోల్బణం - సంవత్సరంలో 10% వరకు ధరలు పెరుగుతాయి
డి) దూకే ద్రవ్యోల్బణం - ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో నడుస్తుంది
1) ఎ, బి, సి, డి
2) ఎ, బి, సి
3) బి, సి, డి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
17. ఒక్క రూపాయి నోటుపై ఎవరి సంతకం ఉంటుంది?
1) గవర్నర్
2) ఆర్థిక మంత్రి
3) ఆర్థికశాఖ కార్యదర్శి
4) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: 3
18. జతపరచండి.
జాబితా - I
i) మూడో ప్రణాళిక
ii) ఎనిమిదో ప్రణాళిక
iii) అయిదో ప్రణాళిక
iv) పదకొండో ప్రణాళిక
జాబితా - II
a) సత్వర సమ్మిళిత వృద్ధి
b) పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన
c) మానవ వనరుల అభివృద్ధి
d) స్వావలంబన, స్వయం పోషకత్వం
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-d, ii-a, iii-b, iv-d
4) i-d, ii-c, iii-a, iv-b
- View Answer
- సమాధానం: 2
19. తరుగుదల అంటే?
1) స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తికి తేడా
2) స్థిర మూలధన వినియోగం
3) 1, 2
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
20. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) పి.వి. నరసింహరావు, మన్మోహన్ సింగ్ సారథ్యంలో 1991లో ప్రారంభించారు
బి) అరవింద్ పనగారియా ప్రకారం రాజీవ్‌గాంధీ కాలంలో సంస్కరణల ప్రక్రియ ప్రారంభించారు
సి) 1991లో నరసింహం అధ్యక్షతన విత్త విధానం కమిటీ చేశారు
డి) 1991లో రూపాయి విలువను తగ్గించారు
1) బి మాత్రమే
2) సి, డి
3) బి, డి
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
21.జతపరచండి.
జాబితా - I
i) కనీస అవసరాల పథకం, 20 సూత్రాల కార్యక్రమం
ii) సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం
iii) ఆపరేషన్ బ్లాక్ బోర్డ (ఓబీబీ)
iv) MPLAD (ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీం)
జాబితా - II
a) అయిదో ప్రణాళిక
b) ఏడో ప్రణాళిక
c) ఎనిమిదో ప్రణాళిక
d) రెండో ప్రణాళిక
1) i-a, ii-d, iii-b, iv-c
2) i-b, ii-a, iii-c, iv-d
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-a, ii-d, iii-b, iv-c
- View Answer
- సమాధానం: 4
22. కింది వాటిలో సరైంది ఏది?
1) జమిందారీ పద్ధతి లేదా శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని లార్డ కారన్ వాలీస్ ప్రవేశ పెట్టాడు
2) మహల్వారీ పద్ధతిని ఆగ్రా, అవధ్ ప్రాంతాల్లో విలియం బెంటింక్ కాలంలో ప్రవేశపెట్టారు
3) రైత్వారీ పద్ధతిని థామస్ మన్రో, రీడ్.. మద్రాస్, బొంబాయి ప్రాంతాల్లో ప్రవేశ పెట్టారు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
23. కింది వాటిలో సరికానిది ఏది?
1) బ్రిటన్ వుడ్స కవలలు - ఐఎంఎఫ్, ఐబీఆర్డీ
2) అంతర్జాతీయ వ్యాపారాన్ని సంరక్షించేది - ప్రపంచ వాణిజ్య సంస్థ
3) రాష్ట్రపతి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి విత్త సంఘాన్ని నియమించే అధికరణ - 281
4) గాడ్గిల్ ఫార్ములా స్థానంలో తీసుకొచ్చిన ఫార్ములా - ముఖర్జీ ఫార్ములా
- View Answer
- సమాధానం: 3
24. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థిక నరకానికి దోహదపడతాడు - మాల్థస్
బి) భూమిపై పుట్టే ప్రతిబిడ్డ అభివృద్ధి కారకం - ఎడ్విన్ కానీన్
1) ఎ, బి రెండూ సరైనవే
2) ఎ, బి రెండూ సరికావు
3) ఎ సరైంది, బి సరికాదు
4) ఎ సరికాదు, బి సరైంది
- View Answer
- సమాధానం: 1
25. ప్రణాళికలు - వాటి లక్ష్యాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
జాబితా - I జాబితా - II
i) మూడో ప్రణాళిక a) 4.4
ii) నాలుగో ప్రణాళిక b) 6.5
iii) అయిదో ప్రణాళిక c) 5.6
iv) తొమ్మిదో ప్రణాళిక d) 5.7
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-c, iii-d, iv-a
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-c, ii-d, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 3
26. కింది వాటిలో సరికానిది ఏది?
1) ఆర్బీఐ స్థాపన - 1935
2) ఆర్బీఐను జాతీయం చేసిన సంవత్సరం - 1949
3) ఇంపీరియల్ బ్యాంక్.. ఎస్బీఐగా జాతీయం చేసిన సంవత్సరం - 1955
4) 6 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసింది - 1980 ఏప్రిల్ 14
- View Answer
- సమాధానం: 4
27. ప్రతిపాదన (A): వాస్తవ జాతీయదాయం నిరంతరం పెరుగుదల అనేది ఆర్థిక వృద్ధి ఒక సూచీ
కారణం (R): జాతీయదాయం పెరుగుదల తలసరి ఆదాయ పెరుగుదలను తప్పనిసరిగా ప్రతిబింబించాల్సిన అవసరం లేదు
1) A, R లు సరైనవి, Aకు R సరైన వివరణ
2) A, R లు సరైనవి, Aకు R సరైన వివరణ కాదు
3) A సరైంది, R సరికాదు
4) A సరైంది కాదు, R సరైంది
- View Answer
- సమాధానం: 2
28. భారతదేశంలో ప్రణాళిక విరామ కాలం?
1) 1966-69
2) 1990-92
3) 1, 2
4) 1972-80
- View Answer
- సమాధానం: 3
29.జనాభా పరిమాణాన్ని తెలియజేసేది?
1) గ్రామాల జనాభా పట్టణాలకు వలస
2) జనాభా స్త్రీ, పురుష నిష్పత్తిలో మార్పు
3) అధిక జనన, మరణ రేట్ల నుంచి అల్ప జనన, మరణ రేట్లకు మారడం
4) అధిక జనన, అల్ప మరణ రేట్ల నుంచి అల్ప జనన, మరణ రేట్లకు మారడం
- View Answer
- సమాధానం: 3
30. జాతీయాదాయాన్ని గణించడానికి ఉపయోగించే మూడు పద్ధతులు ఏవి?
1) ఉత్పత్తి, వ్యయ, ఆదాయ పద్ధతి
2) విదేశీ చెల్లింపులు, ఆదాయ, వినియోగ పద్ధతి
3) పొదుపు, పెట్టుబడి, ఆదాయం పద్ధతులు
4) వ్యయం, ఉత్పత్తి, తరుగుదల పద్ధతులు
- View Answer
- సమాధానం: 1
31. ప్రతిపాదన (A): జీఎన్‌పీ ఎల్లప్పుడూ జీడీపీ కంటే ఎక్కువగా ఉంటుంది
కారణం (R): జీఎన్పీని పొందడానికి జీడీపీకి ఎన్ఎఫ్ఐఏ చేరుస్తారు
1) A, R లు సరైనవి, Aకు R సరైన వివరణ
2) A, R లు సరైనవి, Aకు R సరైన వివరణ కాదు
3) A సరైంది కాదు, R సరైంది
4) A సరైంది, R సరికాదు
- View Answer
- సమాధానం: 3
32. AMRUT ను విస్తరించండి.
1) Atal Mission for Rural & Urban Transformation
2) Atal Mission for Rejuvenation & Urban Transformation
3) Atal Mission for Rejuvenation & Ultra Transformation
4) Atal Mission for Rural & Ultra Transformation
- View Answer
- సమాధానం: 2
33. PRASADను విస్తరించండి.
1) Pilgrimage Rejuvenation and Spiritual Augmentation Drive
2) Pilgrimage Rejuvenation and Spiritual Augmentation Development
3) Pilgrimage Rural and Spiritual Augmentation Drive
4) Pilgrimage Rejuvenation and Spiritual Aerospace Development
- View Answer
- సమాధానం: 1