State College Education: ఆంగ్లం బోధనలో నైపుణ్యం పెంపొందించుకోవాలి
గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ‘ఆంగ్ల మాధ్యమంలో బోధన – ఆంగ్ల భాషలో సామర్థ్యం’ అనే అంశంపై ఆంగ్ల అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన జూన్ 19న ప్రారంభించారు. డాక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో డిగ్రీ స్థాయిలో అన్ని సబ్జెక్టులను ఆంగ్లభాషలో బోధించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు మంచి పునాది వేయవచ్చని చెప్పారు. అధ్యాపకులు ఆంగ్ల భాషా బోధనలో తమను తాము తీర్చిదిద్దుకుంటూ నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
చదవండి: Communication skills: అంతర్జాతీయ అవకాశాలకు.. ఇంగ్లిష్! భాషపై పట్టు సాధించేందుకు మార్గాలు..
ఉన్నత విద్యాశాఖలో ఖర్చుకు వెనుకాడకుండా ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ డిగ్రీ కోర్సుల్లో ‘సింగిల్ మేజర్’ విధానాన్ని ప్రవేశపెట్టిందని, మార్పులకు తగ్గట్టుగా అధ్యాపకులు తమను తాము తీర్చిదిద్దుకోవాలని చెప్పారు. కళాశాల విద్య రాష్ట్ర ప్రత్యేక అధికారి అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఆన్‌లైన్ విధానంలో ఆరు రోజులు నిర్వహించనున్న ఈ శిక్షణకు రాష్ట్రంలోని ఆరు జోన్‌ల పరిధిలో 500 మంది అధ్యాపకులు పాల్గొంటున్నారని తెలిపారు.