Inter Exams Arrangements: మార్చి 1 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు..
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు జిల్లాలో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మార్చి 1 నుంచి ఇంటర్ పబ్లిక్ (థియరీ) పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రశ్న పత్రాలు పోలీసు పహారా నడుమ జిల్లాకు చేరుకుంటున్నాయి. వీటిని మరో రెండు రోజుల్లో 33 స్టోరేజ్ పాయింట్లలో పోలీసు బందోబస్తు నడుమ భద్రపర్చనున్నారు. జిల్లా స్పెషల్ ఆఫీసర్, డీవీఈఓ కోట ప్రకాశరావు ఆధ్వర్యంలో ఆర్‌ఐఓ ప్రగడ దుర్గారావు నేతృత్వంలో డీఈసీ కమిటీ సభ్యులు బి.శ్యామ్‌సుందర్ (ప్రిన్సిపాల్–ఆమదాలవలస), జి.సింహాచలం (ప్రిన్సిపాల్–రణస్థలం), కె.తవిటినాయుడు (ప్రిన్సిపాల్–కొయ్యాం) ఏర్పాట్లలో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు.
ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, అలాగే కస్టోడియన్లు, స్క్వాడ్‌లను నియమించారు. వీరితో కీలకమైన సమావేశాన్ని శనివారం నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని గాయత్రి కళాశాల వేదికగా ఉదయం 9.30 గంటల నుంచి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ISRO Opportunity: విద్యార్థులకు ఇస్రో కల్పిస్తున్న గొప్ప అవకాశం..
83 కేంద్రాలు.. 45,702 మంది విద్యార్థులు
ఇంటర్మీడియెట్ పరీక్షలకు పునర్విభజన శ్రీకాకుళం జిల్లాలో 83 కేంద్రాలను కేటాయించారు. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలే అత్యధికంగా ఉన్నాయి. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 45,702 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో జనరల్ విద్యార్థులు 43,071 మంది, ఒకేషనల్ 2,631 మంది ఉన్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం 19,937 మంది, ద్వితీయ సంవత్సరం 25,765 ఉన్నారు. 83 పరీక్ష కేంద్రాలకు 83 మంది చొప్పున సీఎస్‌లు, డీఓలను నియమించారు. 33 మంది కస్టోడియన్లను నియమించారు. 4 సిట్టింగ్, 10 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. 1600 మంది వరకు ఇన్విజిలేటర్లను వినియోగిస్తున్నారు.
Group-2 Exam: రేపు జరిగే గ్రూప్-2 పరీక్షకు ఏర్పాట్లు సిద్ధం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో కలిపి 1480 సీసీ కెమెరాలను అమర్చారు. వీటిని ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేశారు. అటు ఇంటర్మీడియెట్ బోర్డు రాష్ట్ర అధికారులు, జిల్లా అధికారులు నిరంతరం వీటిని పర్యవేక్షించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ తో పాటు పోలీసు బందోబస్తు కల్పించనున్నారు. అన్ని కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఫర్నీచర్ ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.