Inter Exams 2024: ఇంటర్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు.. పరీక్ష తేదీలు ఇవే..
స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఫిబ్రవరి 5వ తేదీ నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఉంటాయని తెలిపారు. ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. వీటికి 24,334 మంది హాజరు కానున్నారని, 113 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ప్రథమ, ద్వితీయ ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు 2,042 మంది హాజరవుతారని, 11 కేంద్రాల్లో ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు మూడు దఫాల్లో నిర్వహిస్తామని వివరించారు. వేసవి ప్రారంభం దృష్ట్యా కేంద్రాల్లో విద్యార్థులు తాగునీటి సదుపాయంతో పాటు ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ వద్దని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో వాల్ క్లాక్స్‌తోపాటు సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
చదవండి: Latest Central Govt Jobs 2024: టెన్త్, ఇంటర్‌తోనే కేంద్ర కొలువు.. రాత పరీక్ష ఇలా..
నులిపురుగల నివారణ మాత్రల పంపిణీ..
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్న నులిపురుగల నివారణ కార్యక్రమాన్ని నూరు శాతం విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. జిల్లాలో ఒకటి నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు 4,72,534 మందిని గుర్తించామని వెల్లడించారు. వీరందరికీ ఆల్బెండాజోల్ మాత్రలను ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెట్ పాఠశాలు, కళాశాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ మింగించాలని ఆదేశించారు. చిన్నారులు, బాలల ఆరోగ్యం కోసం ప్రతి ఏడాది ఫిబ్రవరి, ఆగస్ట్ నెలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. నులిపురుగులను నియంత్రిస్తే చాలా రోగాల్ని అరికట్టవచ్చని చెప్పారు. జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ ఏ.శ్రావణ్ బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా నులిపురుగుల నివారణ ఆవశ్యకతను వివరించారు. ఒకటి నుంచి రెండు సంవత్సరాలలోపు పిల్లలకు సగం మాత్రను నీళ్లల్లో కలిపి తాగించాలని, 2–19 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్ర వేయాలని సూచించారు.
చదవండి: AP Inter 1st Year Study Material