Intermediate Fee: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు ఈనెల 11 వరకు పొడిగింపు
ఒంగోలు: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు అపరాధ రుసుం లేకుండా ఈనెల 11వ తేదీ వరకు పొడిగించారని ఆర్‌ఐవో ఎ.సైమన్ విక్టర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రెగ్యులర్‌గా మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం చదువుతున్న జనరల్, ఒకేషనల్ విద్యార్థులు, ఫెయిల్ అయి ప్రైవేటుగా విద్యను అభ్యసిస్తున్న వారు పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించాలన్నారు. రూ.1000 అపరాధ రుసుముతో ఈనెల 29వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని చెప్పారు.
Also Read: Manisha Padhi: దేశంలోనే తొలి మహిళా ఏడీసీ.. మా కూతురే మా శక్తి అంటున్న తల్లిదండ్రులు..
గతంలో ఏ విద్యా సంవత్సరంలో అయినా ఫెయిలైన వారు అయినా పరీక్షలు రాసేందుకు అర్హులే అన్నారు. ఫెయిలైన విద్యార్థులు పరీక్ష రాసేందుకు వారి ఫెయిలైన మార్కుల మెమోతో పరీక్ష ఫీజు చదివిన కాలేజీలో పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. మొదటి లేదా రెండో సంవత్సరం చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.550, సైన్స్ విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్ష ఫీజు కింద రూ.250 చెల్లించాలన్నారు.