Skip to main content

Inter Failed Students: ఇంటర్‌ ఫెయిలైన వారికి శుభవార్త

రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం సంస్మరణలకు నాంది పలికింది. విద్యార్థుల అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన విధానాలను అమలు చేస్తున్నారు.
AP inter

అమ్మఒడి, మనబడి నాడు–నేడు, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద వంటి పలు పథకాలను ప్రవేశపెట్టి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియెట్‌లో ఫెయిలైన విద్యార్థులను కూడా రెగ్యులర్‌ విద్యార్థులుగా గుర్తించే విధానాన్ని అమలుచేయనున్నారు. ఇది ఇంటర్‌ అనుత్తీర్ణులైన విద్యార్థులకు సదవకాశంగా భావించవచ్చు.

Also Read : Pranjali Awasthi Success Story : చిన్న వ‌య‌స్సులోనే.. రూ.100 కోట్ల సామ్రాజ్యానికి అధినేత్రి.. ఎలా అంటే..?

ఈ ఏడాది నుంచి నూతన విధానం

ప్రతి విద్యార్థికీ ఇంటర్‌ చదువు మైలురాయి. ఇంటర్‌ పూర్తి చేస్తే ఉన్నత స్థితిలో స్థిరపడడానికి అనువైన విద్యను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యమున్న ఇంటర్‌ను పూర్తిచేయడానికి పలువురు విద్యార్థులు తంటాలు పడుతున్నా రు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన వారిలో దాదాపు 30 నుంచి 40 శాతం మంది సానుకూల ఫలితాలు సాధించలేకపోతున్నారు. అటువంటి వారి కోసం ప్రభుత్వం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నా వాటిలో కొంతమంది తప్పి వచ్చే ఏడాది వరకూ ఎదురుచూడాల్సి వస్తోంది. అటువంటి వారి కోసం ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు తప్పిన విద్యార్థులు మరోసారి కళాశాలలో చేరవచ్చు. తరగతులకు హాజరుకావచ్చు, రెగ్యులర్‌ విద్యార్థులుగా మారిపోవచ్చు.

2021–22, 22–23 విద్యార్థులకు అవకాశం

ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఈ విధానంతో 2021–22, 22–23 విద్యా సంవత్సరాల్లో ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియెట్‌ తప్పిన విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారుల గణాంకాల ప్రకారం పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలో ఈ రెండేళ్లలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులు 9,860 మంది జనరల్‌, 2,748 మంది ఒకేషనల్‌ విద్యార్థులు ఉన్నారు.

అమ్మఒడి పథకానికీ అర్హత

నూతన విధానంలో రెగ్యులర్‌ విద్యార్థులుగా ఫీజులు చెల్లించి తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం అమ్మఒడి పథకం లబ్ధిని అందిస్తోంది. అయితే వారు గతంలో కూడా అమ్మఒడి పథకాన్ని అందుకున్న వారై, ప్రస్తుత సంవత్సరంలో కూడా ఆ పథకానికి అర్హతలు కలిగి ఉండాలి. ఈ మేరకు పూర్వ పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో గత రెండు విద్యా సంవత్సరాల్లో ఇంటర్మీడియెట్‌ అనుత్తీర్ణులైన విద్యార్థులు 12,608 మంది ఉండగా వారందరికీ పథకం అర్హత లభిస్తే ప్రభుత్వంపై రూ.16.39 కోట్ల అదనపు భారం పడనుంది. అయితే ఈ మొత్తాన్ని భారంగా కాక విద్యార్థుల అభ్యున్నతి కోసం ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం భావించి వారికీ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

2021–22, 22–23లో ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులు

జిల్లా జనరల్‌ ఒకేషనల్‌ - విద్యార్థులు విద్యార్థులు

  • ఏలూరు 4,232 1,174
  • పశ్చిమగోదావరి 4,422 1,123
  • తూర్పుగోదావరి 1,206 451

మొత్తం 9,860 2,748

పాసైతే సప్లిమెంటరీకి బదులురెగ్యులర్‌ సర్టిఫికెట్‌

ఈ ఏడాది నుంచి అమలు
2021–22, 2022–23లో ఫెయిలైన విద్యార్థులకు అవకాశం
నెలాఖరు వరకు ఫీజు చెల్లింపులకు గడువు
తరగతులకు హాజరు కావొచ్చు
అమ్మఒడి పథకానికీ అర్హత

Also Read : Success Story : ఎందుకు..? ఏమిటి..? ఎలా..? ఇదే నా స‌క్సెస్‌కు కార‌ణం..?

సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం నూతనంగా ఈ ఏడాది నుంచే ప్రారంభించిన ఈ విద్యా విధానంలో ఫీజులు చెల్లించిన విద్యార్థులు రెగ్యులర్‌ విద్యార్థుల్లా తరగతులకు హాజరై పాఠాలను వినే అవకాశం కల్పిస్తాం. అలా తరగతులకు హాజరైతే మరోసారి ఆయా సబ్జెక్టులపై పట్టు పెరుగుతుంది. తద్వారా పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశాలు పెరుగుతాయి. గతంలో పరీక్షలు తప్పి సప్లిమెంటరీ రాసిన విద్యార్థులకు పాస్‌ సర్టిఫికెట్‌లో సప్లిమెంటరీ విద్యార్థులుగా నమోదు చేసేవారు. నూతన విధానంలో అయితే అలాంటి విద్యార్థి ఉత్తీర్ణుడైతే అతనికి కూడా రెగ్యులర్‌ విద్యార్థిగానే పాస్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. దీనిపై ఇప్పటికే ప్రిన్సిపాళ్లకు అవగాహన కల్పించాం. వారి పరిధిలో ఇంటర్మీడియెట్‌ అనుత్తీర్ణులైన విద్యార్థులతో ఫీజులు చెల్లించేలా చైతన్యపరుస్తున్నాం. ఈ మేరకు దాదాపు 60 శాతానికి పైగా అనుత్తీర్ణులైన విద్యార్థులు ఫీజులు చెల్లించారు. మిగిలిన వారు కూడా నెలాఖరులోపు ఫీజులు చెల్లించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
 

Published date : 06 Nov 2023 03:41PM

Photo Stories