10th, Inter Exams 2024: విద్యార్థుల్లో పరీక్షల ఫీవర్... 54,710 మంది టెన్త్, 1,17,965 మంది ఇంటర్ విద్యార్థులు!
ఈ నేపథ్యంలో మార్చి నెలాఖరు లోపు పదో తరగతి, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చదువుతున్న టెన్త్, ఇంటర్మీడియెట్ విద్యార్థుల్లో పరీక్షల ఫీవర్ ప్రారంభమైంది.
ఇప్పటికే సెకండరీ, మాధ్యమిక విద్యాశాఖలు విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసే దిశగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. విద్యాశాఖ ఈ ఏడాది జూలై నుంచే పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
మార్చి నుంచి పరీక్షల షెడ్యూల్
ప్రస్తుత విద్యాసంవత్సరం 2023–24నకు సంబంధించి 2024 మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం, రెండో తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను మాధ్యమిక విద్యాశాఖ విడుదల చేసింది. ఇంటర్ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి ఒకటి నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.
మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 19న, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 20వ తేదీతో ముగుస్తాయి. ఫిబ్ర వరి రెండో తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, మూడో తేదీన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయి. ఆ పరీక్షలను ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.
సమగ్ర శిక్ష ఒకేషనల్ ట్రేడ్ ఎగ్జామినేషన్‌ను ఫిబ్రవరి 22న ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహి స్తుంది. ఇంటర్ సెకండియర్ జనరల్ విద్యార్థులకు ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి.
చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్ పేపర్స్ | న్యూస్ | టిఎస్ ఇంటర్
ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి ఐదు నుంచి 20 వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్స్‌లో నిర్వహిస్తారు. ఉదయం సెషన్ ప్రాక్టికల్స్ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ ప్రాక్టికల్స్ రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయి.
345 కళాశాలల్లో 1,17,965 మంది విద్యార్థులు
ఉమ్మడి కృష్ణాజిల్లాలో 345 కళాశాలల నుంచి 1,17,965 మంది విద్యార్థులు ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 189 కళాశాలలు ఉండగా వాటి నుంచి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 38,430 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 35,378 మంది పరీక్షలు రాయనున్నారు.
కృష్ణాజిల్లాకు సంబంధించి 156 కళాశాలల నుంచి 23553 మంది మొదటి ఏడాది, 20604 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు.
మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు..
ఉమ్మడి జిల్లాలో 2024 మార్చి 18 నుంచి మార్చి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. 18న ఫస్ట్ లాంగ్వేజ్‌తో ప్రారంభమై 30న ఓఎస్‌ఎస్‌సీ లాంగ్వేజ్ పేపరు–2తో పరీక్షలు ముగుస్తాయి. పరీక్షల షెడ్యూల్‌ను ఏపీ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది.
పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. గత విద్యా సంవత్సరం ఈ పరీక్షలను రోజు విడిచి రోజు నిర్వహించారు. ఈ సారి వరుసగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ పేపర్లను మాత్రం వేర్వేరుగా నిర్వహిస్తారు.
ఉమ్మడి జిల్లాలో పదో తరగతి విద్యార్థులు ఇలా..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో 54,710 మంది పదో తరగతి విద్యార్థులు ఈ ఏడాది పరీక్షకు హాజరుకానున్నారు. 25,660 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 17 మండలాల్లోని 480 విద్యా సంస్థలకు నుంచి 28,181 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు.
వారిలో 10,006 మంది ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. కృష్ణాజిల్లాకు చెందిన 25 మండలాల్లోని 398 విద్యా సంస్థలకు చెందిన 26,529 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. వారిలో 15,654 మంది ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు ఉన్నారు.