Intermediate: ఇంటర్ పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు
Sakshi Education
ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం తగినన్ని బస్సు సర్వీసులు నడపాలని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ నిర్ణయించింది.
మే 5 నుంచి మే 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్న దృష్ట్యా తగినన్ని సర్వీసులు నడపాలని అధికారులకు మే 4న ఆదేశాలు జారీ చేసింది. ‘పరీక్ష కేంద్రాల మార్గంలో సర్వీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయకూడదు. అవసరమైతే అదనపు సర్వీసులు కూడా నిర్వహించాలి. సర్వీసులు లేని పరీక్ష కేంద్రాలకు మే 5lనుంచి కొత్త సరీ్వసులు నడపాలి. అన్ని పరీక్ష కేంద్రాలను బస్టాప్‌లుగా పరిగణించాలి. పాసులు ఉన్న విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కూడా అనుమతించాలి’ అని ఆదేశించింది. పరీక్ష కేంద్రాలకు సర్వీసుల నిర్వాహణ కోసం ప్రత్యేకంగా సూపర్‌వైజర్లను నియమించింది.
చదవండి:
ఇంటర్ స్టడీ మెటీరియల్ | ఇంటర్ మోడల్ పేపర్స్ | ఇంటర్ ప్రివియస్ పేపర్స్
Published date : 05 May 2022 12:06PM