AP ICET 2022: పరీక్ష విధానం, సిలబస్ అంశాలు, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్!
మేనేజ్‌మెంట్, సాఫ్ట్‌వేర్.. ఇటీవల కాలంలో.. అత్యంత ఆదరణ పొందుతున్న విభాగాలు! వీటిల్లో కుదురుకుంటే.. ఆకర్షణీయమైన హోదాలు,వేతనాలు ఖాయం! అందుకే.. డిగ్రీ స్థాయి విద్యార్థులు.. ఆయా రంగాల్లో కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలను అందించే.. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి వీలు కల్పించే ఏపీ ఐసెట్ –2022కు నోటిఫికేషన్ విడుదలైంది!! ఈ నేపథ్యంలో.. ఏపీ ఐసెట్–2022కు అర్హతలు,పరీక్ష విధానం, సిలబస్ అంశాలు, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్..
- ఏపీ ఐసెట్–2022కు నోటిఫికేషన్ వెల్లడి
- జూలై 25న ఆన్‌లైన్ విధానంలో ఐసెట్–2022
- మొదలైన దరఖాస్తు ప్రక్రియ
ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్.. సంక్షిప్తంగా ఐసెట్. రాష్ట్రంలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో సీట్ల భర్తీకి నిర్వహించే పరీక్ష. ముఖ్యంగా ఎంబీఏ పట్టాతో మేనేజ్‌మెంట్ నిపుణులుగా రాణించాలనుకుంటున్న వారికి రాష్ట్ర స్థాయిలో ఎంతో కీలకమైన పరీక్ష,, ఐసెట్. అదే విధంగా ఎంసీఏతో సాఫ్ట్‌వేర్ రంగంలో కొలువులు కోరుకునే వారికి కూడా ఐసెట్ ఉపయుక్త పరీక్ష. తాజాగా.. 2022కు సంబంధించి ఏపీ ఐసెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
అర్హత
- ఎంబీఏ: 50 శాతం మార్కులతో మూడు లేదా నాలుగేళ్ల వ్యవధిలోని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
- ఎంసీఏ: 50 శాతం మార్కులతో మూడు లేదా నాలుగేళ్ల వ్యవధిలోని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంసీఏ అభ్యర్థులు ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్ గ్రూప్ సబ్జెక్ట్‌గా ఉత్తీర్ణులై ఉండాలి.
- ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ICET Study Material
మూడు విభాగాలు.. 200 మార్కులు
ఏపీ–ఐసెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో మొత్తం మూడు సెక్షన్లలో రెండు వందల మార్కులకు నిర్వహిస్తారు. వివరాలు..
సెక్షన్–ఎ | అనలిటికల్ ఎబిలిటీ | ప్రశ్నలు | మార్కులు |
---|---|---|---|
ఉపవిభాగం1 | డేటా సఫిషియన్సీ | 20 | 20 |
ఉపవిభాగం2 | ప్రాబ్లమ్ సాల్వింగ్ | 55 | 55 |
సెక్షన్–బి | కమ్యూనికేషన్ ఎబిలిటీ | ||
ఉపవిభాగం1 | వొకాబ్యులరీ | 15 | 15 |
ఉపవిభాగం2 | ఫంక్షనల్ గ్రామర్ | 20 | 20 |
ఉపవిభాగం3 | బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ | 15 | 15 |
ఉపవిభాగం4 | రీడింగ్ కాంప్రహెన్షన్ | 20 | 20 |
సెక్షన్–సి | మ్యాథమెటికల్ ఎబిలిటీ | ||
ఉపవిభాగం1 | అర్థమెటికల్ ఎబిలిటీ | 35 | 35 |
ఉపవిభాగం2 | అల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ | 10 | 10 |
ఉపవిభాగం3 | స్టాటిస్టికల్ ఎబిలిటీ | 10 | 10 |
మొత్తం | 200 | 200 |
- పరీక్ష సమయం: రెండున్నర గంటలు.
- సెక్షన్–బిని ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే నిర్వహిస్తారు.
- సెక్షన్–ఎ, సిలను తెలుగు లేదా ఇంగ్లిష్ మీడియంలో రాసే అవకాశం ఉంది.
- పరీక్ష ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా జరుగుతుంది.
- పరీక్షను రెండు సెషన్లుగా నిర్వహిస్తారు. రెండు సెషన్లలో హాజరైన అభ్యర్థులు పొందిన మార్కులను నిర్దిష్ట విధానంలో నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా గణించి ర్యాంకులు కేటాయిస్తారు.
విజయం సాధించాలంటే
మొత్తం మూడు విభాగాలు.. తొమ్మిది ఉప విభాగాలుగా ఉండే ఐసెట్ పరీక్షలో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు విశ్లేషణాత్మక దృక్పథం, అన్వయ నైపుణ్యాలను అలవర్చుకోవాలి. పరీక్ష తీరు, సిలబస్ స్థాయిపై అవగాహన పొందాక.. విభాగాల వారీగా పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగించాలి.
డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్
మొదటి విభాగంలో ఉండే డేటా సఫిషియెన్సీ; ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాల్లో రాణించాలంటే.. అభ్యర్థులు తమ విశ్లేషణ నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. ఎందుకంటే.. ఈ విభాగం నుంచి అడిగే ప్రశ్నలు డేటాను ఇచ్చి.. దాని ఆధారంగా సమస్య సాధించేవిగా ఉంటాయి. ఇందులో మంచి స్కోర్ చేసేందుకు బేసిక్ అర్థమెటిక్ అంశాలపై పట్టు సాధించాలి.
అదే విధంగా స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. గణితంపై ప్రాథమిక అవగాహన తప్పనిసరి. ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగంలో.. రీజనింగ్ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు కోడింగ్, డీ–కోడింగ్, బ్లడ్ రిలేషన్, సిరీస్, సిలాజిజమ్, సీటింగ్ అరేంజ్‌మెంట్ వంటి అంశాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి.
Communication Ability
కమ్యూనికేషన్ ఎబిలిటీ
- సెక్షన్–బిగా ఉండే ఈ విభాగం.. మిగతా విభాగాలతో పోల్చితే కొంత సులభమైన విభాగంగా పేర్కొనొచ్చు. విశ్లేషణ సామర్థ్యం, కంపేరిటివ్ అప్రోచ్, కాసింత ప్రాక్టీస్ ఉంటే.. మొత్తం 70 ప్రశ్నలకు గాను 50 ప్రశ్నలకు తేలిగ్గానే సమాధానాలు గుర్తించే అవకాశం ఉంది.
- వొకాబ్యులరీ కోసం బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. వొకాబ్యులరీ పెంచుకునేందుకు ప్రతి రోజు కనీసం 20 కొత్త పదాలు నేర్చుకోవడం, వాటిని వినియోగించే తీరుపై ప్రాక్టీస్ చేయాలి.
- ఫంక్షనల్ గ్రామర్‌లో మంచి మార్కుల కోసం బేసిక్ గ్రామర్ అంశాలుగా పేర్కొనే సినానిమ్స్, యాంటానిమ్స్, కొశ్చన్ ట్యాగ్స్, డైరెక్ట్–ఇన్‌డైరెక్ట్ స్పీచ్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి. ఇందుకోసం ఆరు నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ గ్రామర్ బుక్స్ చదవాలి.
- సెక్షన్–బిలో మూడో ఉప విభాగం.. బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ. ఇందులో అభ్యర్థులకు సామాజిక వ్యాపార–వాణిజ్య అంశాలు, తాజా పరిణామాలు, కంప్యూటర్ బేసిక్స్‌పై అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. వీటిలో రాణించాలంటే.. బిజినెస్ టెర్మినాలజీ, కొత్త వ్యాపార విధానాలు, ఆయా సంస్థలు–వాటి క్యాప్షన్లు వంటివి తెలుసుకోవాలి. ఇక కంప్యూటర్ టెర్మినాలజీకి సంబంధించి బేసిక్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్‌కు సంబంధించిన ముఖ్యభాగాలు.. వాటి పనితీరుకు సంబంధించి ప్రాథమిక నైపుణ్యం కలిసొస్తుంది.
- రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగంలో.. ప్యాసేజ్‌ల ఆధారంగా అడిగే 20 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. ముందుగా అభ్యర్థులు ఒక అంశాన్ని, అందులోని కీలక పదాలను, కీలక సారాంశాన్ని పసిగట్టే నేర్పు అవసరం. ఇందుకోసం వ్యాసాలు చదవడం, ఇంగ్లిష్ స్టోరీ బుక్స్ చదవడం ఉపయుక్తం.
Mathematical Ability
మ్యాథమెటికల్ ఎబిలిటీ
ఐసెట్‌లోని మూడో విభాగంగా పేర్కొన్న మ్యాథమెటికల్ ఎబిలిటీలో..అర్థమెటిక్, జామెట్రికల్, స్టాటిస్టికల్ ఉప విభాగాలు ఉంటాయి. వీటిల్లో నైపుణ్యం పొందాలంటే.. ముందుగా మ్యాథమెటిక్స్‌లోని ప్రాథమిక సూత్రాలపై అవగాహన పొందాలి. ఇందుకోసం హైస్కూల్ స్థాయి మ్యాథమెటిక్స్ పుస్తకాలను అధ్యయనం చేయాలి. ప్రశ్నల శైలి కొంత క్లిష్టంగా ఉండే స్టాటిస్టికల్ ఎబిలిటీ కోసం ఇంటర్మీడియెట్ స్థాయి పుస్తకాల ప్రిపరేషన్ అవసరం. ముఖ్యంగా ప్రాబబిలిటీ, ఇనీక్వాలిటీస్ అంశాల కోసం ఈ స్థాయి ప్రిపరేషన్ తప్పనిసరి. అర్థమెటిక్ విభాగంలోని ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించాలంటే.. శాతాలు, లాభ నష్టాలు, నిష్పత్తులు, మెన్సురేషన్, పని–కాలం, పని–సమయం వంటి టాపిక్స్‌పై పట్టు సాధించాలి. అల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ కోసం ట్రిగ్నోమెట్రీ, సెట్స్ అండ్ రిలేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్ వంటి అంశాల్లో నైపుణ్యం కీలకం.
ప్రాక్టీస్.. సక్సెస్‌కు సాధనం
ఐసెట్‌లో సక్సెస్‌కు ప్రధాన సాధనం.. ప్రాక్టీస్. పరీక్షలో నిర్దేశించిన విభాగాలన్నీ ప్రాక్టికల్ ఓరియెంటేషన్,అప్లికేషన్ ఓరియెంటేషన్‌గా ఉంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఆయా అంశాల రీడింగ్‌తోపాటు ప్రాక్టీస్ కూడా చేసే మంచి ర్యాంకు సాధించేందుకు అవకాశం ఉంటుంది.
వేయి లోపు ర్యాంకుతో
రాష్ట్రంలో బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో సీటు సొంతం చేసుకోవాలంటే.. వేయి లోపు ర్యాంకుతోనే సాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది గణాంకాల ప్రకారం– 313 ఎంబీఏ కళాశాలల్లో దాదాపు 35వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉండగా.. అర్హత సాధించిన వారి సంఖ్య 34,789గా ఉంది. బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్‌గా పేరొందిన యూనివర్సిటీ కాలేజ్‌లు, టాప్–10, టాప్–20 ఇన్‌స్టిట్యూట్‌లలో సీటు వేయిలోపు ర్యాంకుతోనే సాధ్యమని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి నుంచే పరీక్ష తీరు, విభాగాలు, అంశాలపై అవగాహన ఏర్పరచుకుంటు నిర్దేశిత సిలబస్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి.
ఏపీ ఐసెట్–2022 ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: మే 12 నుంచి జూన్ 10 వరకు;
- ఆన్‌లైన్ అప్లికేషన్‌లో సవరణ అవకాశం: జూలై 11 నుంచి జూలై 13 వరకు
- హాల్ టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం: జూలై 18 నుంచి
- ఐసెట్ తేదీ: జూలై 25 (ఉదయం 9:00 నుంచి 11:30 వరకు; మధ్యాహ్నం 3:00–5:30)
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx