Skip to main content

APSCHE: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల వివరాలు

అనంతపురం: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌–2023 ఫలితాలు పది రోజుల్లో విడుదల చేస్తామని సెట్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జింకా రంగజనార్దన జూన్‌ 2న ఒక ప్రకటనలో తెలిపారు.
APSCHE
ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల వివరాలు

ఇంటర్మీడియెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా 25 శాతం వెయిటేజీ ఇవ్వనుండటంతో ఫలితాల ప్రక్రియ జాప్యం అవుతోందని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల ఇంట­ర్మీడియెట్, సీబీఎస్‌ఈ, ఆర్‌జీయూకేటీ, ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల ఫలితాలను పరిగణన­లోకి తీసుకుని వెయిటేజీ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఇంకా చాలా మంది విద్యార్థులు తమ ఇంటర్‌ మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదని పేర్కొన్నారు.

☛ College Predictor - 2023 - TS EAMCET AP EAPCET

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థుల మార్కులు ఆటోమేటిక్‌గా నమోదవుతాయని, నేరుగా బోర్డు నుంచి ఏపీ ఈఏపీసెట్‌ నిర్వాహకులకు పంపుతారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియెట్‌ బోర్డు మినహా ఇతర బోర్డుల్లో ఇంటర్‌ చదివినవారు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో తమ మార్కులు నమోదు చేయాలని సూచించారు. ఇప్పటివరకు మార్కులు నమోదు చేయనివారి సెల్‌ఫోన్‌ నంబరుకు సమాచారం వస్తుందని తెలిపారు. 

☛ AP EAPCET 2023 Engineering Question Papers with Key

Published date : 03 Jun 2023 03:31PM

Photo Stories