AP EAPCET 2023 Certificates Uploading: ఏపి ఈఏపిసెట్‌లో ఇంటర్ సర్టిఫికెట్ల అప్‌లోడ్‌కు చివరి తేది ఇదే..
విద్యార్ధులు తమ పత్రాలను (మార్క్స్ మెమో) అప్‌లోడ్ చేసే సమయంలో స్పస్టంగా కనిపించేలా జాగ్రత్త వహించవలసిందిగా కోరారు.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ విద్యార్ధులు అప్ లోడ్ చేయనవసరం లేదు:
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలలో పాసై ఈఏపిసెట్‌లో పాసైన విద్యార్ధులు మార్క్స్ మెమోను అప్ లోడ్ చేయనవసరం లేదని తెలిపారు. ఏపి ఈఎపిసెట్ – 2023 లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈఏపిసెట్‌లో మొత్తంగా 2,52,717 మంది విద్యార్ధులు అర్హత సాధించారు. వీరిలో ఇంకా 42 వేల మంది విద్యార్ధులకు ఇంటర్ వెయిటేజ్ ప్రకారం ర్యాంకులు ప్రకటించాల్సి ఉంది.
ఏపీ ఈఏపీసెట్-2023 వివరాలు:
ఏపీ ఈఏపీసెట్-2023 ఫలితాలను జూన్ 14 న విడుదల చేశారు. మే 15 నుంచి 19వ తేదీ వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతపురం జేఎన్‌టీయూ-ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి 3,38,739 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్‌కు 2,24,724 మంది పరీక్ష రాయగా 76.32 శాతం ఉత్తీర్ణతతో 1,71,514 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్‌లో 90,573 పరీక్ష రాయగా 89.66 శాతం మంది ఉత్తీర్ణతతో 81,203 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.
చదవండి: