AP EAPCET 2023: ఏపీ ఈఏపీసెట్‌కు దరఖాస్తుల వెల్లువ
![AP EAPCET 2023](/sites/default/files/images/2023/05/25/telangana-students-696x387-1685008510.png)
ఏప్రిల్ 17న అనంతపురంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో గతేడాది కంటే అధికంగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. గతేడాది ఇంజనీరింగ్ విభాగంలో 2,06,579 దరఖాస్తులు రాగా.. ఈసారి ఇప్పటికే 2,32,064 దరఖాస్తులు అందాయి. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 15తో దరఖాస్తుకు గడువు ముగిసింది. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 96,250 దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్– ఫార్మసీ రెండు విభాగాలకు దరఖాస్తు చేసుకున్నవారు 939 మంది ఉన్నారు.
చదవండి: ఏపీ ఈఏపీసెట్ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
మొత్తం మీద అన్ని విభాగాలకు 3,29,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 30 వరకు, రూ.1,000 అపరాధ రుసుముతో మే 5 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో మే 12 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని శోభాబిందు తెలిపారు. మే 4 నుంచి 6 వరకు విద్యార్థుల డేటాలో మార్పులుచేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇంజనీరింగ్ విభాగానికి దరఖాస్తులు అధికంగా రావడంతో 9 సెషన్లలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. గతంలో 8 సెషన్లలోనే పరీక్ష నిర్వహించాలని భావించినప్పటికీ దరఖాస్తులు అధికంగా రావడంతో మరో సెషన్ అందుబాటులోకి తెచ్చామన్నారు. విద్యార్థులు ఇచ్చిన తొలి మూడు ఆప్షన్లలోనే పరీక్ష కేంద్రం ఉంటుందని చెప్పారు. పూర్తి చేసిన ఈఏపీసెట్ దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రాన్ని పరిశీలించాలని విద్యార్థులకు సూచించారు. మే 15 నుంచి ఇంజనీరింగ్ విభాగంలో ప్రవేశపరీక్షలు ప్రారంభమవుతాయన్నారు.