Skip to main content

APSCHE: ఏపీ ఈఏపీ సెట్‌ బైపీసీ స్ట్రీమ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఏపీ ఈఏపీసెట్‌–2023 బైపీసీ స్ట్రీమ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసినట్లు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, హెల్ప్‌లైన్‌ సెంటర్‌ సమన్వయకర్త గురుగుబెల్లి దామోదర్‌రావు తెలిపారు.
Technical Education Department Notice, Etcherla Campus Event: Counseling Schedule Released, APSCHE, AP EAPSET-2023 BIPC Stream Counseling Schedule, Srikakulam Government Polytechnic College Announcement,

కళాశాలలో న‌వంబ‌ర్ 2న‌ వివరాలు వెల్లడించారు. బైపీసీ స్ట్రీమ్‌లో బీటెక్‌ బయోటెక్నాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ, బి. ఫార్మశీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలు జరగుతాయని చెప్పారు. న‌వంబ‌ర్ 14వరకు కౌన్సెలింగ్‌ కొనసాగుతుందని అన్నారు. న‌వంబ‌ర్ 8వ తేదీ లోపు ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు, రిజస్ట్రేషన్‌, న‌వంబ‌ర్ 9 నుంచి 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌, సర్టిఫికేట్ల అప్‌లోడ్‌, 11 నుంచి 13 వరకు ఆప్షన్ల ఎంపిక, 14న ఆప్షన్ల మార్పు ఉంటుందని అన్నారు. 17న అలాట్‌మెంట్ల ప్రకటన, 18 నుంచి 21 మధ్య సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ కళాశాలలకు చేయవల్సి ఉంటుందని చెప్పా రు.

చదవండి: AP EAPCET 2023 Seat Allotment : AP EAPCET 2023 సీట్లు కేటాయింపు.. మీకు ఏ కాలేజీలో సీటు వ‌చ్చిందో.. తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి

విద్యార్థులు పూర్తి వివరాలు, కౌన్సెలింగ్‌ కోసం హెచ్‌టీటీపీఎస్‌://సెట్స్‌.ఏపీఎస్‌సీహెచ్‌ఈ, ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌ సైట్‌ లింక్‌ సంప్రదించాలని సూచించారు. పూర్తిస్థాయి ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్‌ చేయాలని అన్నారు. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో పరిశీలన ఉంటుందని చెప్పారు. దివ్యాంగులు, చిల్డ్రన్‌ ఆఫ్‌ ఆర్మ్‌డ్‌ పర్సన్‌, స్పోర్ట్సు అండ్‌ గేమ్స్‌, స్కౌట్‌ గైడ్‌, నేషనల్‌ క్యాడెట్‌ కాంప్స్‌, ఆంగ్లో ఇండియన్‌, న‌వంబ‌ర్ 10,11 తేదీ ల్లో ప్రత్యేక కేటగిరీల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని చెప్పారు. సెట్‌ అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Published date : 04 Nov 2023 09:00AM

Photo Stories