APEAPCET 2024: ఏపీ ఈఏపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్ ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభం
తిరుపతి : ఏపీ ఈఏపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్ ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కో–ఆర్డినేటర్ వై.ద్వారకనాథ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ 1నుంచి 7వ తేదీలోపు ప్రాసెసింగ్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలని సూచించారు. వీటిని హెల్ప్‌లైన్ సెంటర్లో పరిశీలిస్తామని తెలిపారు. 8నుంచి 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని, 13న మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. 16న సీట్ అలాట్‌మెంట్, 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. స్పెషల్ కేటగిరీ (పీహెచ్, ఎన్‌సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్) అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్లు జిరాక్స్ కాపీలతో ఈ నెల 6నుంచి 10వ తేదీలోపు విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలని సూచించారు. వివరాలకు ‘‘ఏపీఎస్‌సీహెచ్‌ఈ.ఏపి.జీఓవి.ఇన్’’ వెబ్‌సైట్‌ను సందర్శించాలని, ఏమైనా సమస్యలుంటే హెల్ప్‌లైన్ సెంటర్‌కు అభ్యర్థులు రావచ్చని కోరారు.
Also Read: AP EAMCET College Predictor