Skip to main content

AP 10th Class Results 2022: ప‌దో త‌ర‌గ‌తి ఫలితాలు విడుద‌ల వాయిదా.. సోమ‌వార‌మే ఫ‌లితాలు.. కార‌ణం ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టెన్త్‌ ఫలితాల విడుదలను వాయిదా వేశారు . జూన్‌ 4న ఉదయం 11 గంటలకి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజ‌శేఖ‌ర్ విజయవాడలో ఫలితాలను విడుద‌ల చేయాల్సింది ఉంది.
AP 10th Class Results 2022 Postponed
AP 10th Class Results 2022 Postponed

కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఫ‌లితాల‌ను వాయిదా వేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించ‌నున్నారు. రికార్డు స్థాయిలో త‌క్కువ‌ రోజుల్లోనే విద్యాశాఖ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు . ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. ఈసారి 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాయగా, పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేసి 20 వేల మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. సోమవారం విడుద‌ల చేయ‌నున్న ఫ‌లితాల‌ను ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌( www.sakshieducation.com)లో చూడొచ్చు.

ఇలా చేస్తే చర్యలు తప్పవ్‌..
టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలపై విద్యార్థులకు ర్యాంకులు అంటూ ప్రకటనలు చేసే ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యుటోరియల్‌ సంస్థలపై చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు చేస్తే ఆయా సంస్థల యాజమాన్యాలు, ఇతరులకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారని స్పష్టం చేసింది. ఈమేరకు విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా ఎస్సెస్సీ పబ్లిక్‌ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీచేయడాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ జూన్‌ 1న 83వ నంబరు జీవో జారీచేశారు. 

ఏడేళ్ల వరకు జైలు, రూ.లక్ష వరకు జరిమానా..
ఎస్సెస్సీ పబ్లిక్‌ పరీక్షల్లో గతంలో గ్రేడింగ్‌ విధానంలో ఫలితాలను ప్రకటించే వారు. 2020 నుంచి గ్రేడ్లకు బదులు విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు, ట్యుటోరియల్‌ విద్యాసంస్థలు విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ తమ సంస్థకే ఉత్తమ ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు వచ్చాయంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలో తప్పుడు ప్రకటనలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను పక్కదారి పట్టిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలతో ఆయా విద్యాసంస్థలు విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించకుండా చర్యలు తీసుకోవాలని, వీటివల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారని పలువురు పాఠశాల విద్యాశాఖకు వినతులు ఇచ్చారు. ఏపీ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ యాక్ట్‌–1997 ప్రకారం ఇటువంటి మాల్‌ప్రాక్టీస్, తప్పుడు ప్రకటనలను చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు, రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు. టెన్త్‌ పరీక్షల్లో గ్రేడ్లకు బదులు మార్కులతో ఫలితాలను ప్రకటించనున్నందున ఆయా సంస్థలు ర్యాంకులతో తప్పుడు ప్రకటనలు చేయరాదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యాసంస్థలు ఏ రూపంలోను, ఏ స్థాయిలోను ర్యాంకులతో ఇలాంటి ప్రకటనలు చేయడానికి వీల్లేదని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.

Published date : 04 Jun 2022 11:34AM

Photo Stories