స్కూళ్లకు వేసవి సెలవులు.. పునఃప్రారంభం తేదీ ఇదే..
జూలై 4న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఏప్రిల్ 23న ఉత్తర్వులు జారీ చేశారు. మే 4 లోగా 1–9 తరగతుల విద్యార్థులకు పరీక్షల నిర్వహణను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత టీచర్లు పరీక్షల మూల్యాంకనం పూర్తి చేయాలి. మే 5న ఇంగ్లిష్ లాంగ్వేజ్, వొకాబులరీపై విద్యార్థులకు బేస్‌లైన్ టెస్టు నిర్వహిస్తారు. ఆ తర్వాత మే 6 నుంచి జూలై 3 వరకు విద్యార్థులకు సెలవులు ఇచ్చినా పాఠశాలలు మే 20 వరకు కొనసాగనున్నాయి. టీచర్లు మే 20 వరకు విధులకు హాజరవ్వాలి. పదో తరగతి పరీక్షలు, మూల్యాంకనం, మార్కులు, ఇతర సమాచారం అప్‌లోడింగ్ తదితరాల దృష్ట్యా 20 వరకు స్కూళ్లు కొనసాగనున్నాయని కమిషనర్ వివరించారు.
చదవండి:
AP 10వ తరగతి 2022 మోడల్ పేపర్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
AP 10వ తరగతి 2022 కొత్త టైమ్ టేబుల్
AP 10వ తరగతి బిట్‌బ్యాంక్‌ని డౌన్లోడ్ చేసుకోండి