Tenth Class Exams 2024: నేటి నుంచి పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ టెస్ట్‌లు
కాళోజీ సెంటర్ : వార్షిక పరీక్షలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి ఈనెల 12వ వరకు సబ్జెక్టుల వారీగా స్పెషల్ టెస్ట్‌లు నిర్వహించనున్నట్లు డీఈఓ వాసంతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు ఈ పరీక్షలు ఉంటాయని తెలిపారు. 5న ఫస్ట్ లాంగ్వేజ్, 6న సెకండ్ లాంగ్వేజ్, 7న ఇంగ్లిష్, 8న మేథమెటిక్స్, 9న ఫిజికల్ సైన్స్ (ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు), 10న బయాలాజికల్ సైన్స్ (ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు),12న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ పేర్కొన్నారు.
Also Read : Biology Bit Bank
జవాబు పత్రాలను ఏ రోజుకారోజు మూల్యాంకనం చేసి విద్యార్థుల ప్రగతిని తెలిపి, వారి సందేహాలను నివృత్తి చేయడమే పరీక్షల ముఖ్య ఉద్దేశమని చె ప్పారు. అలాగే, మరుసటి రోజు జరిగే సబ్జెక్ట్‌కు సంబంధించి విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే టీచర్లు నివృత్తి చేసి సూచనలు చేస్తారని వివరించారు. ఈ టెస్ట్ ద్వారా విద్యార్థులకు రైటింగ్ ప్రాక్టీస్ విధానం సులభతరమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే డీసీఈబీ సెక్రటరీ జి.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు ఎస్సెస్సీ స్పెషల్ టెస్ట్ –2024 ప్రశ్నపత్రాలు చేరేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఎంఈఓలు, నోడల్ అధికారులు వివిధ పాఠశాలలను సందర్శించి పరీక్షలను పర్యవేక్షించాలని డీఈఓ సూచించారు.