Tenth Class: విద్యార్థులపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు
Sakshi Education
బీసీ సంక్షేమ హాస్టళ్లలో పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు.
విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి 13 జిల్లాల బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మార్చి 29న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్టడీ అవర్స్‌లో విద్యార్థుల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సూచించారు. టెలివిజన్ కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగపడేలా చూడాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాములు, కమిషనర్ అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
Published date : 30 Mar 2022 02:34PM