Skip to main content

5th Class & Inter Admissions: గురుకులం సీవోఈలో ప్రవేశాలకు ఆహ్వానం

మధురవాడ: కొమ్మాది రిక్షా కాలనీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులం బాలికల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీవోఈ)లో 5వ తరగతి, ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ టి.నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు.
Admission notice for Class 5 and Intermediate First Year   Invitation for admissions in Gurukulam COE   Join COE for Class 5 and Intermediate First Year studies

5వ తరగతిలో 80, ఇంటర్‌లో 80 చొప్పున సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 23వ తేదీలోగా https:// apbragcet.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 5వ తరగతిలో ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సెప్టెంబర్‌ 1, 2011 నుంచి 31 ఆగస్టు 2015 మధ్య జన్మించినవారై ఉండాలన్నారు.

చదవండి: Careers After 12th Class: ఉన్నత విద్యకు ఈ ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సిందే!!

బీసీ కన్వర్టడ్‌ క్రిస్టియన్‌(బీసీసీ), ఓసీకి చెందిన వారు 1 సెప్టెంబర్‌ 2013 నుంచి 31 ఆగస్టు 2015 మధ్య జన్మించిన వారై ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ నంబర్లు 95509 64542, 92460 49529, 81868 97867లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ నాగమణి కోరారు.

చదవండి: Inter Admissions in TTWREIS: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలు.. పరీక్ష విధానం ఇలా‌..

Published date : 06 Feb 2024 02:59PM

Photo Stories