Tenth Class Public Exams 2024: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం...హాల్‌టికెట్ చూపితే
Sakshi Education
కడప : ఈనెల 18 నుంచి 30వ తేది వరకు జరిగే పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు అన్ని పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో తమ నివాసం నుంచి పరీక్షా కేంద్రం వరకు, తిరిగి తమ నివాసం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని జిల్లా ప్రజా రవాణాధికారి పి.గోపాల్‌రెడ్డి తెలిపారు. కేవలం పరీక్ష జరిగే రోజుల్లో మాత్రమే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని 183 పరీక్షా కేంద్రాల్లో 27,858 మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Published date : 14 Mar 2024 04:11PM