Skip to main content

School Holidays: దసరా సెలవులు ప్రకటించిన విద్యాశాఖ

సాక్షి, అమరావతి: అక్టోబ‌ర్‌ 14 నుంచి 24 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది.
Dussehra Holidays 2023
దసరా సెలవులు ప్రకటించిన విద్యాశాఖ

దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. రాష్ట్రంలో అక్టోబ‌ర్‌ 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉ­న్న­త పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వి­ద్యా­ర్థులకు నిర్దేశించిన సిలబస్‌ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు.

ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతా­యి. ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజు మం­డల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు పంపిస్తారు.

పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు ప్రశ్నాపత్రాలు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతా­ధికారులు ఆదేశాలు జారీ చేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం సమయంలో. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మద్యాహ్నం పరీక్షలు ఉంటాయి.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ముఖ్యమైన ప్రశ్నలు | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంక­నం చేసి విద్యార్ధులకు అందిస్తారు. అలాగే ఆన్‌­లై­న్‌ పోర్టల్‌లోనూ మార్కులు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబ‌ర్‌ 10న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలని సూచించింది.

Published date : 02 Oct 2023 04:25PM

Photo Stories