Skip to main content

Nadu Nedu: పాఠశాలలకు కార్పొరేట్‌ హంగులు

గుంటూరు ఎడ్యుకేషన్‌: పాఠశాలలకు వెలిగిపోతున్నాయి. మహర్దశ వచ్చింది. నాడు– నేడుతో కార్పొరేట్‌ లుక్‌ సతరించుకున్నాయి.
Corporate attitudes to schools

మౌలిక వసతుల నుంచి విద్యా బోధన వరకు అధునికత సంతరించుకుంది. ‘సామాజిక మార్పు పోరాటాల ద్వారా.. పోరాటాలు విజ్ఞానం ద్వారా.. విజ్ఞానం.. విద్య ద్వారా అందుతుందని’ అంబేడ్కర్‌ ఆలోచనను ఆచరణకు నడుంబిగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, నాడు– నేడు కింద అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.

పేద పిల్లలకు సకల వసతులు కల్పించి కార్పొరేట్‌ విద్యనందించాలనే సంకల్పం ఫలిచింది. పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి.

చదవండి: Amma Odi for Poor Students: పేదలకు బాసటగా అమ్మ ఒడి.. ఏటా ఇంతమందికి లబ్ధీ..!

కొత్త రూపురేఖలు

పాఠశాలల భౌతిక స్వరూపాన్ని మార్చి వేయడంతో పాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులతో కూడిన పది కాంపొనెంట్స్‌ వారీగా పనులు చేపట్టారు. నాలుగేళ్లలో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా తరగతి గదులను నిర్మిస్తున్నారు. ఈ విధంగా 165 పాఠశాలల్లో కొత్తగా 656 అదనపు తరగతి గదులు అందుబాటులోకి రానున్నాయి.

పైపె మెరుగులకే పరిమితమైన గత టీడీపీ పాలన

ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నడూ చూడని అభివృద్ధి పాఠశాలల్లో ప్రత్యక్ష్యంగా కనిపిస్తోంది. పాఠశాలల భవనాలకు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించడం, ప్రాంగణాలను శుభ్రపర్చడం, రంగులు వేసి పైపె మెరుగులు దిద్దడమొక్కటే గత టీడీపీ పాలనలో అభివృద్ధిగా పరిగణించిన నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలనలో పాఠశాలల ముఖచిత్రం సమూలంగా మారిపోయింది.

చదవండి: School Exams: షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి

పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీలకే బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం వారి ఆధ్వర్యంలోనే ప్రతి ఒక్క సామగ్రిని కొనుగోలు చేసి, సరఫరా దారులకు నగదు చెల్లింపులు జరుపుతున్నారు.

బ్రాండెడ్‌ మెటీరియల్‌

దశాబ్ధాల తరబడి మౌలిక వసతులకు నోచుకోని పాఠశాలలను ఆధునికీకరించడంతో పాటు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన బ్రాండెడ్‌ మెటీరియల్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రతి పాఠశాలకు కనీసంగా రూ.25 లక్షలు మొదలు అత్యధికంగా రూ.2.50 కోట్ల వరకు ఖర్చు చేశారు. విద్యార్థులకు సురక్షితమైన తాగునీటి కోసం ఆర్వో వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా టాయిలెట్ల నిర్మాణంతో పాటు టాయిలెట్లు నిర్మించారు. విద్యార్థులు తరగతి గదిలో సౌకర్యవంతంగా కూర్చునేందుకు వీలుగా డ్యూయల్‌ డెస్క్‌లు, ప్రతి తరగతి గదిలో సీలింగ్‌ ఫ్యాన్లు, ఎల్‌ఈడీ లైట్లతో పాటు బ్లాక్‌బోర్డుల స్థానంలో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌(ఐఎఫ్‌పీ)ల ద్వారా ఆధునిక విద్యాబోధన చేస్తున్నారు.

చరిత్రలో ఇన్ని వసతులు చూడలేదు

పాఠశాల చరిత్రలో ఎన్న డూ లేని ఆధునిక వసతుల ను ప్రభుత్వం నాడు– నేడు ద్వారా కల్పించింది. మొద టి దశలో రూ.47 లక్షలతో ఆధునికీకరించడంతో పా టు రెండో దశలో రూ.23 లక్షలతో రెండు తరగతి గదులను నిర్మించింది. పూర్తిస్థాయి వసతులతో ఆధునికీకరించిన మా పాఠశాల మోడల్‌ స్కూల్‌గా నిలిచింది. 
– బి. విజయలక్ష్మి, హెచ్‌ఎం, జీబీఎస్‌, గుంటూరు

  • ఎంపికై న పాఠశాలల సంఖ్య 1,183
  • నిధులు మంజూరు రూ.283 కోట్లు
  • రెండో దశ గుంటూరు జిల్లా
  • మొత్తం పాఠశాలల సంఖ్య 1,040
  • ఎంపికై న పాఠశాలల సంఖ్య 563
  • నిధులు మంజూరు 215.75 కోట్ల
  • అదనపు తరగతి గదులు 656
     
Published date : 18 Apr 2024 05:53PM

Photo Stories