Skip to main content

Freedom for Little Birds: లైంగిక వేధింపులపై పిల్లలకు అవగాహన

కాకినాడ సిటీ: స్వేచ్ఛ ఫర్‌ లిటిల్‌ బర్డ్స్‌– పసిపిల్లలపై లైంగిక వేధింపులు నివారించే దిశగా నిర్వహిస్తున్న కార్యక్రమం కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు జరగబోతోందని కలెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు.
Education and prevention in Kakinada schools   Childrens awareness of sexual abuse   Collector Kritika Shukla addressing the media

కాకినాడ సీ పోర్ట్సు లిమిటెడ్‌ అండ్‌ పడాల చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భాగంగా 2 నుంచి 7 తరగతుల పిల్లలకు, ప్రైవేట్‌ పార్ట్స్‌, సేఫ్‌ టచ్‌ ఆన్‌ సేఫ్‌ టచ్‌, సేఫ్టీ రూల్స్‌, పోక్సో యాక్ట్‌, ఇంటర్నెట్‌ సేఫ్టీ వంటి విషయాలపై పర్సనల్‌ సేఫ్టీ ఎడ్యుకేషన్‌ అనే మాడ్యుల్‌ ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. దీనికి సంబంధించిన ప్రోసిడింగ్స్‌ 2023–24, 2024–25 అకడమిక్‌ వరకు ఇవ్వాల్సిందిగా ఆర్జేడీని కలెక్టర్‌ కృతికా శుక్లా ఆదేశించారు.

చదవండి: Andhra Pradesh Govt Jobs 2023: మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కాకినాడ సీ పోర్ట్సు లిమిటెడ్‌ సహకారంతో మూడు జిల్లాల్లో ఉన్న 75 వేల మందికి పైగా చిన్న పిల్లలకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తామని కేఎస్‌పీఎల్‌ సీఈవో మురళీధర్‌ వివరించారు.

పడాల చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రాజెక్టు ట్రైనర్‌ ఫమీన్‌ మాట్లాడుతూ గత సంవత్సరం 80 స్కూల్స్‌, 12 వేల మంది పిల్లలతో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్‌ చొరవతో, కాకినాడ సీ పోర్ట్సు లిమిటెడ్‌ సౌజన్యంతో 1,000 స్కూల్స్‌, 75 వేల మందికి పైగా పిల్లలని చేరుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కెఎస్‌పీఎల్‌, సీఎస్‌ఆర్‌ మేనేజర్‌ కరీం, పడాల చారిటబుల్‌ ట్రస్ట్‌ సీఈవో సూర్యప్రసాద్‌ పాల్గొన్నారు.

sakshi education whatsapp channel image link

Published date : 15 Dec 2023 03:32PM

Photo Stories