Tenth Board Exams: టెన్త్ పరీక్షలకు పకడ్బందీగా సన్నద్ధం..
శ్రీకాకుళం:
సన్నద్ధం చేయాలి
మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు విద్యార్థులను ఉన్నతంగా సన్నద్ధం చేయాలి. పరీక్ష కేంద్రాల్లో అధికారులు, తనిఖీ బృందాలు, సిబ్బంది నియామకం దాదాపుగా పూర్తయింది. వేసవిని దృష్టిలో పెట్టుకుని పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, ఫ్యాన్లు, ఫర్నీచర్, మరుగుదొడ్లు పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరి చేశాం. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
– కె.వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీకాకుళం
DSC 2024: జిల్లా వ్యాప్తంగా 323 ఉపాధ్యాయ ఖాళీలు..
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లాలో ఏర్పాట్లు పక్కాగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
145 కేంద్రాలు.. 30,574 మంది విద్యార్థులు
పునర్విభజన శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు గత ఏడాది 149 కేంద్రాల్లో జరగగా.. ఈ ఏడాది 145 కేంద్రాల్లో జరగనున్నాయి. ఇందులో ఏ సెంటర్లు 55, బి–సెంటర్లు 28, సి–సెంటర్లుగా 62 కేంద్రాలను గుర్తించారు. కేటాయించిన పరీక్ష కేంద్రాలలో 90 శాతానికిపైగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలకు 30,574 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 28,982 మంది కాగా బాలురు 14,843 మంది, బాలికలు 14139 మంది ఉన్నారు. అలాగే ప్రైవేటు విద్యార్థులు 1,592 మంది ఉన్నారు. ఇందులో 975 మంది బాలురు, 617 మంది బాలికలు ఉన్నారు.
Entrance Test: ప్రశాంతంగా ‘ప్రతిభ’ ప్రవేశపరీక్ష
పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక ఫోకస్..
ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాలపై అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతరం పర్యవేక్షించనున్నారు. పరీక్ష నిర్వహణకుగాను కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్, జేసీ ఎం.నవీన్‌ల అధ్యక్షతన ఇప్పటికే పలుమార్లు సమీక్షించారు. పరీక్ష నిర్వహణకు 145 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 145 మంది డిపార్ట్‌మెంట్ అధికారులు, 65 సి–సెంటర్లలో కస్టోడియన్లను నియమించారు. తనిఖీల కోసం రెవెన్యూశాఖ పర్యవేక్షణ లో 7 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను, మరో 15 సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమిస్తున్నారు. ఎస్‌హెచ్‌ఓలుగా 34 మందిని నియమించారు. పరీక్షల నిర్వహణ కోసం 1350 మందిని ఇన్విజిలేటర్లగా నియమిస్తున్నారు. ప్రధానంగా 15 రూట్లను గుర్తించారు. ఇందుకుగాను 45 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు. 20 వరకు రూట్లలో బస్సు సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అలాగే టెన్త్ హాల్‌టిక్కెట్ చూపిస్తే ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ప్రయాణించేలా ఉత్తర్వులు వెలువరించనుంది.