Skip to main content

Tenth Exams 2024 : పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

Arrangements for Conducting tenth Class  Exams 2024   Direction to Public Transport Department for Special Services to Students
పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

పార్వతీపురం: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహ ణకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేయాలని, అధికా రులందరూ సమన్వయంతో పనిచేసి పరీక్షలు పూర్తి చేయాలని జిల్లా ఇన్‌చార్జి రెవెన్యూ అధికారి జి.కేశవనాయుడు తెలిపారు. పరీక్షల నిర్వహణకు ముంద స్తు ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్‌ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పరీక్షల నిర్వహణకు వివిధ శాఖలు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. విద్యార్థుల కోసం బస్సుసౌకర్యం లేని గ్రామాల నుంచి ప్రత్యేక సర్వీసులు నడపాలని ప్రజా రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. రైల్వే గేట్లు ఉన్న గ్రామాల నుంచి విద్యార్థులు ముందుగా బయలుదేరేలా చూడాలన్నారు. పరీక్ష సమయాల్లో విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూ చించారు.

Also Read: Social studies Bit Bank

పరీక్ష కేంద్రాల్లో మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన భద్రత చర్యలపై పోలీస్‌ శాఖకు సూచనలు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు పరీక్షల ఏర్పాట్లను వివరించారు. జిల్లాలోని 217 పాఠశాలలకు చెందిన 11,198 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరుకానున్నారని, వీరిలో 10,534 మంది విద్యార్థులు రెగ్యులర్‌, 664 మంది ప్రైవేటు అభ్యర్థులుగా పేర్కొన్నారు. జిల్లాలో 66 పరీక్ష కేంద్రాలు, 600 మంది ఇన్విజిలేటర్లు, మూడు ఫ్లయింగ్‌ స్కాడ్‌లను నియమిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖాధికారి ఎం.ఇ.రేణుజ్యోతి, జిల్లా ప్రజారవాణా అధికారి టి.వి.ఎస్‌.సుధాకర్‌, ఆర్టీఓ సి.మల్లిఖార్జునరెడ్డి, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Published date : 13 Feb 2024 03:06PM

Photo Stories