Nick Vujicic: విద్యారంగంలో ఏపీ రోల్ మోడల్
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంగ్లిష్ మీడియం, అమ్మ ఒడి వంటి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయమని శ్లాఘించారు. తనతోపాటు యువత రానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తి అన్నారు. ఫిబ్రవరి 6న రాత్రి విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో విద్యార్థులు, యువతలో స్ఫూర్తి నింపేలా ప్రసంగం చేశారు. ప్రతి ఒక్క రి జీవితంలో ఎత్తుపల్లాలు, గెలుపోటములు సహజ మని.. అపజయాలు తాత్కాలికమని అన్నారు.
చదవండి: Nick Vujicic: ఇక్కడ విద్యారంగం అద్భుతం
నిరాశ, నిస్పృహలకు గురికాకుండా వాటిని విజయాలకు మెట్లుగా మలచుకుంటూ ముందు కు సాగాలని పిలుపు నిచ్చారు. విద్యార్థులు, యువత బాగా చదవ డంతో పాటు కుటుంబాన్ని ప్రేమించడం అలవర్చు కోవాలని సూచించారు. కాళ్లు, చేతులూ లేని నిక్ ను వీల్‌చైర్‌లో వేది కపైకి తీసుకొచ్చారు. అనంత రం ఆయనను ఎత్తుకుని వేదికపై ప్రత్యే కంగా ఏర్పాటు చేసిన టేబుల్‌పై కూర్చోబె ట్టారు. అక్కడ నుంచే ఆయన ‘హల్లో.. ఎవ్రిబడీ..’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి యువతను ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు.