Tenth Class Public Exams 2024: పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
గార్లదిన్నె: పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా పనిచేయాలని ఉపాధ్యాయులకు డీఈఓ వరలక్ష్మి సూచించారు. బుధవారం గార్లదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్, పీడబ్ల్యూఎస్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. జెడ్పీహెచ్‌ఎస్‌లో రికార్డులో కంటే ఎక్కువగా బియ్యం నిల్వ ఉండడం గమనించి హెచ్‌ఎంను ప్రశ్నించారు. మూడు రోజుల్లో నివేదిక పంపాలని ఆదేశించారు. కట్టెల పొయ్యి మీద కాకుండా గ్యాస్ మీద వంట చేయాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు.
Also Read: AP 10th Class Telugu Study Material
అనంతరం ప్రైమరీ పాఠశాలలో రెండవ తరగతి విద్యార్థులతో పుస్తకాలు చదివించారు. కిచెన్ షెడ్డు, వంట తయారీ చాలా బాగుందని కితాబునిచ్చారు. మోడల్ స్కూల్‌లో కిచెన్ షెడ్డు బాగా లేకపోవడం, కట్టెల పొయ్యి మీద వంట చేస్తుండడాన్ని గమనించి వెంటనే వంట చేసే స్థలాన్ని మార్చాలన్నారు. గ్యాస్ మీద వంట చేసేలా చొరవ తీసుకోవాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు.