UPSC Civil Services 2023 Final Results: సివిల్స్‌ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు

సాక్షి, ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 1,016 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు, అనిమేష్‌ ప్రధాన్‌కు రెండో ర్యాంకు, దోనూరి అనన్యరెడ్డికి మూడో ర్యాంకు దక్కింది. ఇక ఈ యూపీఎ‍స్సీ ఫలితాల్లో వరంగల్‌కు చెందిన ఇద్దరు సెలక్ట్‌ అయ్యారు. 
 

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ర్యాంకుల పంట పండింది. మొత్తం 1,016 మంది ఎంపికయితే.. అందులో తెలుగు అభ్యర్థులు కనీసం 50కి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

  • దోనూరు అనన్యారెడ్డికి మూడో ర్యాంకు
  • మెరుగు కౌశిక్ 22ర్యాంకు
  • నందల సాయి కిరణ్‌కు 27 ర్యాంకు
  • మెరుగు కౌశిక్‌కు 82వ ర్యాంకు
  • పింకిస్ ధీరజ్ రెడ్డి 173 ర్యాంకు
  • అక్షయ్ దీపక్ 196 ర్యాంకు
  • భానుశ్రీ 198 ర్యాంకు
  • ప్రదీప్ రెడ్డి 382 ర్యాంకు
  • వెంకటేష్ 467 ర్యాంకు
  • హరిప్రసాద్‌ రాజు 475వ ర్యాంకు
  • పూల ధనుష్ 480 ర్యాంకు
  • కె. శ్రీనివాసులు 526 ర్యాంకు
  • సాయితేజ 558 ర్యాంకు
  • కిరణ్‌ సాయింపు 568 ర్యాంకు
  • మర్రిపాటి నాగభరత్‌ 580 ర్యాంకు
  • పీ. భార్గవ్ 590 ర్యాంకు
  • అర్పిత 639 ర్యాంకు
  • ఐశ్వర్య నీలిశ్యామల 649 ర్యాంకు
  • సాక్షి కుమార్ 679 ర్యాంకు
  • రాజ్‌కుమార్‌ చౌహన్ 703 ర్యాంకు
  • జి.శ్వేత 711 ర్యాంకు
  • ధనుంజయ్ కుమార్ 810 ర్యాంకు
  • లక్ష్మీ భానోతు 828 ర్యాంకు
  • ఆదా సందీప్‌ కుమార్‌ 830 ర్యాంకు
  • జె.రాహుల్‌ 873 ర్యాంకు
  • హనిత వేములపాటి 887 ర్యాంకు
  • కె.శశికాంత్‌ 891 ర్యాంకు
  • కెసారపు మీనా 899 ర్యాంకు
  • రావూరి సాయి అలేఖ్య 938 ర్యాంకు
  • గోపద నవ్యశ్రీ 995 ర్యాంకు

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముగ్గురికి ర్యాంకులు వచ్చాయి. వరంగల్‌ నగరానికి చెందిన జయసింహారెడ్డికి 103వ ర్యాంకు వచ్చింది. గీసుకొండ మండలం అనంతరం గ్రామానికి చెందిన సయింపు కిరణ్‌కు  568 ర్యాంకు వచ్చింది. శివనగర్ కు చెందిన కోట అనిల్ కుమార్‌కు 764వ ర్యాంకు వచ్చింది. జయసింహారెడ్డికి IAS వచ్చే అవకాశం ఉంది. కిరణ్‌కు IPS లేదా IRS రావొచ్చు. అనిల్ కుమార్‌కు IRS వచ్చే అవకాశం ఉంది.


(సయింపు కిరణ్)

గతేడాది మే 28వ తేదీన యూపీఎస్పీ ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగాయి. ప్రిలిమ్స్‌ పరీక్షల అనంతరం మేయిన్స్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 15, 16, 17, 23, 24 తేదీల్లో జరిగాయి. మేయిన్స్‌ పరీక్షల ఫలితాలను డిసెంబర్‌ ఎనిమిదో తేదీన విడుదల చేశారు. అనంతరం జనవరి రెండో తేదీ నుంచి ఏప్రిల్‌ రెండు నుంచి ఏప్రిల్‌ తొమ్మిదో తేదీ వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. నేడు తుది ఫలితాలు వెలువడ్డాయి. 

#Tags