UPSC CDS (I) 2025 Notification: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(1), 2025 నోటిఫికేషన్ విడుదల.. ఎంపిక ప్రక్రియ ఇలా..
ఇందులో విజయం సాదించినవారు శిక్షణ అనంతరం త్రివిధ దళాల్లో మంచి వేతనంతో సేవలు అందించవచ్చు. భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. డిగ్రీ పూర్తిచేసుకున్న అవివాహిత పురుషులు, మహిళలు ఆన్‌లైన్ ద్వారా డిసెంబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 457
1. ఇండియన్ మిలిటరీ అకాడమీ(IMA): 100
2. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ మెన్ నాన్ టెక్నికల్: 275
3. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ ఉమెన్ నాన్ టెక్నికల్: 18
4. ఇండియన్ నేవల్ అకాడమీ(INA): 32
అర్హత: ఏదైనా డిగ్రీ
5. ఎయిర్ ఫోర్స్ అకాడమీ(IFA): 32
అర్హత: ఇంజినీరింగ్
వయసు: 20-24 మధ్య జన్మించినవారు
ఎంపిక ప్రక్రియ: రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఫర్ ఇంటెల్లిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల అధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: 300 మార్కులకు ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు వ్యవధి 2 గంటలు.
ఇంటర్వ్యూ: ఇంటర్వ్యూ విభాగానికి 300 మార్కులు కేటాయించారు. కేవలం ఓటీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఇది 200 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలినవారు రూ.200 చెల్లించాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, హనుమకొండ, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.
ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 11-12-2024 నుంచి 31-12-2024 వరకు.
దరఖాస్తు సవరణ తేదీలు: 01.01.2025 నుంచి 07.01.2025 వరకు.
దరఖాస్తు సవరణకు చివరి తేదీ: 07.01.2025.
పరీక్ష తేదీ: 13-04-2025.
UPSC CDS I పరీక్ష 2025 ఆన్‌లైన్ అప్లికేషన్: https://upsconline.nic.in/upsc/OTRP/
>> NLC India Recruitment 2024: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు .. నెలకు రూ. 1.50 లక్షల పైనే జీతం..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |