UG Admissions: నిమ్‌హాన్స్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు..

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ (నిమ్‌హాన్స్‌).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

కోర్సుల వివరాలు

  •     బీఎస్సీ అనెస్తీషియా టెక్నాలజీ–11 సీట్లు.
  •     బీఎస్సీ నర్సింగ్‌–85 సీట్లు.
  •     బీఎస్సీ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ–11 సీట్లు.
  •     బీఎస్సీ క్లినికల్‌ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ–07 సీట్లు.
  •     సర్టిఫికెట్ల కోర్సు–న్యూరోపాథాలజీ టెక్నాలజీ–02 సీట్లు.
  •     పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా ఇన్‌ సైకియాట్రిక్‌/మెంటల్‌ హెల్త్‌ నర్సింగ్‌–45 సీట్లు.
  •     పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా ఇన్‌ న్యూరోసైన్స్‌ నర్సింగ్‌–09 సీట్లు.
  •     అర్హత: కోర్సును అనుసరించి 12వ తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌), డిప్లొమా, డిగ్రీ, రిజిస్టర్డ్‌ నర్స్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
  •     వయసు: బీఎస్సీ కోర్సుకు 17 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. సర్టిఫికేట్‌ కోర్సుకు గరిష్టంగా 40 ఏళ్లు, పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా కోర్సులకు వయో పరిమితి లేదు.
  •     ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఒరిజనల్‌ సర్టిఫికేట్ల వెరిఫికేషన్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
  •     ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.06.2024
  •     బీఎస్సీ కోర్సుల ప్రవేశ పరీక్ష తేది: 21.07.2024
  •     వెబ్‌సైట్‌: https://nimhans.ac.in

 Free Coaching for Group 2 Exam: గ్రూప్‌-2 మెయిన్స్ కోసం ఉచిత శిక్ష‌ణ త‌ర‌గ‌తులు..!

#Tags