TSPSC Group-2 Syllabus : 582 పోస్టులు.. గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల సిల‌బ‌స్ ఇదే..

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–2లో ఇప్పటివరకు రాత పరీక్షలతో పాటు ఇంట‌ర్య్వూ విధానం ఉండేది. దీనివల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోందన్న భావనతో తెలంగాణ ప్ర‌భుత్వం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసింది.
TSPSC Group-2 Syllabus

భర్తీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలవుతుందని భావించి ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గతంలో మొత్తం 675 మార్కులకు ఉండే గ్రూప్‌–2 పరీక్షను (ఇంటర్వ్యూ 75 మార్కులు పోను) 600 మార్కులకు కుదించారు. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌–2 ప‌రీక్ష సిల‌బ‌స్ కింది మేర‌కు ఉంటుంది.

TSPSC Group-1 Syllabus: 503 పోస్టులు.. గ్రూప్‌–1 ప‌రీక్ష‌ల‌ సిల‌బ‌స్ ఇదే..

మొత్తం మార్కులు: 600

రాతపరీక్ష (ఆబ్జెక్టివ్‌ టైప్‌) :

పేపర్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు సమయం (గంటలు) మార్కులు
1 జనరల్‌ స్టడీస్, జనరల్‌ సైన్స్‌ 150  2 1/2 150
2 హిస్టరీ, పాలిటీ     అండ్‌ సొసైటీ                        
  1. భారతదేశ మరియు తెలంగాణ సామాజిక సాంస్కతిక చరిత్ర
  2. భారత రాజ్యాంగం మరియు రాజకీయాల పర్యావలోకనం (ఓవర్‌ వ్యూ)
  3. సోషల్‌ స్ట్రక్చర్, ఇష్యూస్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీస్‌
150 2 1/2 150
3 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌                        
  1. భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరియు సవాళ్లు
  2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి
  3. ఇష్యూస్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఛేంజెస్‌
150 2 1/2 150
4 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం                        
  1. తెలంగాణ ఆలోచన పుట్టుక (1948–1970)
  2. మద్దతు కూడగట్టే దశ (1971–1990)
  3. తెలంగాణ ఏర్పాటు దిశగా..(1991–2014)
150 2 1/2 150

TSPSC: 1,373 గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్‌ సిలబస్ ఇదే..!

గ్రూప్‌–2లో ఉండే పోస్టులు ఇవే..
మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్‌ (నాయిబ్‌ తహసీల్దార్‌), సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2, జూనియర్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (కో–ఆపరేటివ్‌ సబ్‌ సర్వీసెస్‌), అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కో–ఆపరేటివ్‌ సబ్‌ సర్వీసెస్‌), అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (మండల పంచాయతీ అధికారి), ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (పీఆర్‌), అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌), ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఎండోమెంట్‌), అసిస్టెంట్‌ సెక్షన్‌  ఆఫీసర్‌ (సెక్రెటేరియట్, లెజిస్లేచర్, ఫైనాన్స్‌, లా).

TSPSC: 9,168 గ్రూప్-4 ఉద్యోగాలు.. ప‌రీక్ష సిలబస్ ఇదే..!

#Tags