TSPSC Jobs Updates 2024 : టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు తొలగిన అడ్డంకులు.. సెప్టెంబర్‌లో నియామకాలు...!
ఈ పోస్టులకు గతేడాది జులై 13, 14 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. కొన్ని కారణాల రిత్యా ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉంది. తాజాగా ఈ ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ పూర్తి చేసింది. తాజాగా TSPSC ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు వెల్లడించింది. త్వరలోనే నియామక పత్రాలు కూడా అందించనుంది. మొత్తం 185 పోస్టులకు గానూ 171 పోస్టులకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేసింది. మరో 14 పోస్టులకు అర్హులు లేకపోవడంతో ప్రస్తుతం వాటి భర్తీ ప్రక్రియను చేపట్ట లేదు. సెప్టెంబరు 15వ తేదీ నాటికి ఎంపికైన 171 మంది వీఏఎస్‌లకు నియమక ఉత్తర్వులు పంపిణీ చేయనున్నారు.
మళ్లీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం..
పశు సంవర్ధక శాఖలో గడిచిన రెండేళ్లలో పదవీ విరమణలు, పదోన్నతులు, ఇతర కారణాల వల్ల మరో 121 వీఏఎస్‌ల పోస్టులు ఖాళీ అయినట్లు కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. వాటి భర్తీకి మళ్లీ నోటిఫికేషన్ వెలువరించే అవకాశం ఉంది.