TS CM Revanth Reddy : గుడ్‌న్యూస్‌.. టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు, నోటిఫికేషన్‌ల‌పై కీల‌క నిర్ణ‌యం ఇదే.. వీటిపై..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి.. ప‌రిపాల‌న‌లో వేగ‌వంతంగా ముందుకు వెళ్తుతున్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి హోదాలో ఆరు గ్యారంటీల తొలిఫైల్‌పై రేవంత్‌ సంతకం చేశారు. దీంలో ప్ర‌స్తుతం రెండు అమ‌లులో ఉన్నాయి కూడా. ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి నేడు తెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు చెప్ప‌నున్నారు.

ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన రెండు రోజుల్లో ఉద్యోగాల భర్తీపై సమీక్ష నిర్వహించనున్నారు. ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను తీసుకోని రివ్యూ మీటింగ్‌కు హాజరుకావాలని టీఎ‍స్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది.

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1,2,3&4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి.. అంటే 2014 నుంచి టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు, నోటిఫికేషన్‌లకు సంబంధించిన పూర్తి వివరాలతో సమీక్షకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాదిన్నరగా.. టీఎస్‌పీఎస్సీలో పేపర్ల లీక్‌లు, ఆపై పరీక్షల వాయిదాల వ్యవహారంతో ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే.

➤ TS Teacher Jobs Notification : తెలంగాణ‌లో 20,740 టీచర్ ఉద్యోగాలు ఖాళీలు.. నోటిఫికేష‌న్ ఎప్పుడంటే..?

తెలంగాణ‌లో 2024 ఫిబ్రవరి 1వ‌ తేదీన గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు.. అలాగే ఏప్రిల్ 1వ తేదీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు.. జూన్ 1వ‌ తేదీన గ్రూప్ 3& 4 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుద‌ల చేస్తామ‌ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలిపిన విష‌యం తెల్సిందే. అలాగే మొద‌టి సంవ‌త్స‌రంలోనే 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా నియామకాలు ఉంటాయని మేనిఫెస్టోలో వెల్ల‌డిచింది. ఇంకా పోలీసు, మెడిక‌ల్‌, ఇంజ‌నీరింగ్‌, ఉపాధ్యాయ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని తెలిపింది.

☛ తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

కొత్త‌గా మ‌ళ్లీ నోటిఫికేష‌న్  ఇస్తారా.. అనే అయోమ‌యంలో..

గ‌త ప్ర‌భుత్వంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ 1, 2, 3, 4 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చి.. ఒక ఉద్యోగం కూడా భ‌ర్తీ చేయ‌లేదు. అయితే గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన గ్రూప్స్ ఉద్యోగాల‌ భ‌ర్తీ ప్ర‌క్రియ కొన‌సాగుతుందా.. లేదా..? కొత్త‌గా మ‌ళ్లీ నోటిఫికేష‌న్  ఇస్తారా.. అనే అయోమ‌యంలో అభ్య‌ర్థులు ఉన్నారు. గ్రూప్స్ 1, 2, 3, 4 ప్రస్తుతం వివిధ దశలలో ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ప్రభుత్వం మారిపోవడంతో వీటి పరిస్థితి ఎలా ఉంటుందో అభ్య‌ర్థుల‌కు అర్ధం కావ‌డం లేదు. ఈ విష‌యంపై అభ్య‌ర్థుల‌కు నేడు ఒక స్ప‌ష్ట‌మైన క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

➤ TS New Government Jobs Notifications 2024 : తెలంగాణ కొత్త ప్ర‌భుత్వంలో కొత్త ఉద్యోగాలు నోటిఫికేష‌న్ల తేదీలు ఇవే.. మ‌రి పాత నోటిఫికేష‌న్ల సంగ‌తి ఏమిటి..?

#Tags