TSPSC Paper Leak 2023 : రాజశేఖర్‌ ఇంట్లో మరికొన్ని కొశ్చ‌న్ పేప‌ర్లు.. కీలక ఆధారాలు ఇవే.. అలాగే ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) త‌వ్వేకొద్ది న‌మ్మ‌లేని నిజాలు ఎన్నో భ‌య‌టప‌డుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ పశ్నపత్రాల లీకేజీ కేసులో పోలీసు కస్టడీలో నాలుగో రోజు సిట్‌ అధికారులు నిందితులను విచారించారు.
tspsc paper leak case 2023

ఇవాళ్టి దర్యాప్తులో పలు కీలక అధారాలను సిట్‌ అధికారులు సేకరించినట్టు సమాచారం. పరీక్ష రాసిన గోపాల్‌, నీలేష్‌కు నీలేష్ సోదరుడు రాజేంద్రనాయక్‌ డబ్బులు సమకూర్చినట్టు గుర్తించారు. మేడ్చల్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కేతావత్‌ శ్రీనివాస్‌ ద్వారా మరికొంత నగదు ఇప్పించినట్టు సమాచారం.

➤☛ TSPSC Paper Leak Case : ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లోకి గ్రూప్‌–1 సహా ఇతర ప్రశ్నపత్రాలు.. ఇంకా న‌మ్మ‌లేని నిజాలు ఎన్నో..

రూ.14 లక్షలు సమకూర్చినట్టు..
బడంగ్‌పేటలోని ప్రవీణ్‌ ఇంట్లో నిన్న సిట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. మణికొండలోని రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో సోదాల సమయంలో మరికొన్ని ప్రశ్నపత్రాలను సిట్‌ బృందం స్వాధీనం చేసుకుంది. మార్చి 5న నీలేష్, గోపాల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్ష రాశారు. పేపర్‌ ఇచ్చినందుకు ఇద్దరు అభ్యర్థులు కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ ద్వారా రూ.14 లక్షలు సమకూర్చినట్టు సిట్‌ అధికారులు గుర్తించినట్టు సమాచారం. నిందితురాలు రేణుకతో పాటు ఆరుగురిని హిమాయత్‌ నగర్‌లోని సిట్‌ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌ ఇంకా సీసీఎస్‌ కార్యాలయంలోనే ఉన్నారు.

☛➤ KTR : ఈ టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు.. మళ్లీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.. అలాగే అన్ని..

పేపర్ లీకేజీ వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ సిట్‌ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులు ఫోన్‌లో మాట్లాడిన వారి చిరునామాలు సేకరించిన సిట్.. సంప్రదింపులు జరిపి అభ్యర్థుల ఇళ్లకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరో వైపు నిందితుల వెనక ఎవరున్నారనే వివరాలు ఇంటెలిజెన్స్ పోలీసులు సేకరిస్తున్నారు. హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయంలో టీఎస్‌పీఎస్సీ నుంచి తీసుకువచ్చిన కంప్యూటర్లను సైబర్ క్రైమ్ పోలీసులు విశ్లేషిస్తున్నారు. 

☛ TSPSC Paper Leak 2023 : టీఎస్‌పీఎస్సీ 26 నోటిఫికేషన్లు.. 20 పరీక్షలకు పైగా ర‌ద్దు..?

టీఎస్‌పీఎస్సీలోని కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల‌ను సిట్‌ కార్యాలయానికి తీసుకొచ్చి సిట్‌ అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండెంట్ శంకర్ లక్ష్మిని మరొకచోట సిట్ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.

త‌న స్నేహితుడైన సురేశ్‌కూ.. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రంను..
టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్‌ వ్యవహారంలో మరో పేరు వెలుగులోకి వచ్చింది. కమిషన్‌ మాజీ ఉద్యోగి, తన స్నేహితుడైన సురేశ్‌కూ ప్రవీణ్‌కుమార్‌ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం పంపినట్లు తేలింది. దీంతో సురేశ్‌ను అదుపులోకి తీసుకొని సిట్‌ అధికారులు  ప్రశ్న‌స్తున్నారు. తమ అదుపులో ఉన్న తొమ్మిది మంది నిందితులను కూడా వరసగా నాలుగో రోజూ ప్రశ్నించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేశారు. 

ఆ 10 మంది టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు గ్రూప్‌-1 క్వాలిఫై..

గ్రూప్‌–1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ప్రవీణ్‌కుమార్‌ గతేడాది జూన్‌ నుంచి ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. కమిషన్‌లోనే నెట్‌వర్క్‌ అడ్మిన్‌గా పని చేస్తున్న రాజశేఖర్‌ సాయంతో కస్టోడియన్‌ కంప్యూటర్‌లో ఉన్న ఈ ప్రశ్నపత్రాన్ని గతేడాది అక్టోబర్‌ తొలి వారంలో చేజిక్కించుకున్నాడు. దీన్ని వినియోగించి తాను పరీక్షకు సిద్ధం కావడంతో పాటు తన స్నేహితుడైన సురేశ్‌కు వాట్సాప్‌ ద్వారా పంపాడు. అతడు కూడా మంచి మార్కులతో ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యాడు. దీంతో సురేశ్‌ను సిట్‌ అధికారులు అదుపులోకి తీసు కుని ప్రశ్నిస్తున్నారు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో కమిషన్‌లో పని చేస్తున్న 10 మంది ఉద్యోగులు క్వాలిఫై అయినట్లు సిట్‌ గుర్తించింది. ముగ్గురు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ఏడుగురు రెగ్యులర్‌ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది.

➤☛ TSPSC Paper Leak Accused Renuka : పేప‌ర్ లీక్ కోసం.. గాలం వేసిందిలా.. చివ‌రికి తానే గాలానికి చిక్కుకుందిలా..

గ్రూప్‌–1 అనుభవంతో మిగతా పేపర్లను కూడా.. 

గ్రూప్‌–1 పరీక్ష పేపర్లు చేజిక్కించుకున్న అనుభవంతో ప్రవీణ్, రాజశేఖర్‌లు మిగిలిన పరీక్షల సమయంలోనూ తమ ప్రయత్నాలు కొసాగించారు. గత నెల ఆఖరి వారంలో మరో నాలుగు పరీక్షలకు సంబంధించిన పది క్వశ్చన్‌ పేపర్లు వీరికి చిక్కాయి. అయితే వాటిని ఎలా విక్రయించాలో అర్థం కాని ప్రవీణ్‌ తనతో సన్నిహితంగా ఉండే రేణుకను సంప్రదించాడు. తన సమీప బంధువైన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ ద్వారా ఏఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న నీలేశ్‌ నాయక్, గోపాల్‌ నాయక్‌లను రేణుక సంప్రదించింది. ప్రవీణ్‌ నుంచి పేపర్‌ అందగానే భర్త డాక్యాతో కలిసి స్వగ్రామమైన మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం పగిడ్యాల్‌ తండాకు వెళ్లి, రెండు రోజుల పాటు తన ఇంట్లోనే నీలేశ్‌, గోపాల్‌తో చదివించింది. ఈ నేపథ్యంలోనే సిట్‌ అధికారులు మంగళవారం రేణుక, డాక్యా నాయక్, నీలేశ్, గోపాల్‌లను ఆ తండాకు తీసుకువెళ్లి సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ చేశారు.

➤☛ TSPSC: పరీక్షలన్నీ రీషెడ్యూల్‌?.. పరీక్షల తేదీలూ ఇవే..

రాజశేఖర్ తన పెన్‌డ్రైవ్‌లోని కొశ్చ‌న్ పేప‌ర్లును..

లీకైన ప్రశ్నపత్రాలను ప్రవీణ్‌తో పాటు రాజశేఖర్‌ సైతం తన పెన్‌డ్రైవ్‌లోని కాపీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతను ఎవరికైనా అమ్మడం, షేర్‌ చేయడం జరిగిందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. రాజశేఖర్‌ ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్, వాట్సాప్‌ గ్రూప్స్‌లో ఉన్న వారితో జరిగిన సంప్రదింపుల వివరాలు ఆరా తీస్తున్నారు. వీరిలో ఎవరైనా గ్రూప్‌–1 సహా ఇతర పరీక్షలు రాశారా? ఉత్తీర్ణులయ్యారా? తదితర వివరాలు సేకరిస్తున్నారు.

☛➤ టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

#Tags