TSPSC Hostel Welfare and Warden Exam Dates 2024: హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్‌ ఉద్యోగాల ప‌రీక్ష‌ల తేదీలు ఇవే.. ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న తెలంగాణ‌లోని వివిధ ఉద్యోగాల ప‌రీక్ష‌ల తేదీల‌ను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్ 16వ తేదీ (ఆదివారం) విడుద‌ల చేసింది.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్– 1, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–2, వార్డెన్ గ్రేడ్–1 & గ్రేడ్–2, మాట్రాన్ గ్రేడ్– 1 & గ్రేడ్–2, లేడీ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షల తేదీల‌ను వెల్లడించింది. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ Group 1&2&3 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

ఈ పరీక్షలను జూన్ 24వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 581 ఉద్యోగాలను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. అలాగే జూన్ 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ 10.00 – 12.30 వరకు, మధ్యాహ్నం సెషన్ -2.30–5.30 వరకు ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను పరీక్షకు మూడు రోజుల ముందు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకొని హాల్ టికెట్ తో పాటు కచ్చితంగా ఒరిజినల్ గుర్తింపు కార్డుతో పరీక్ష కేంద్రాలకు హాజరు కావలసి ఉంటుందని కమిషన్ ప్రకటించింది.

ఈ పోస్టుల వివ‌రాలు ఇవే..
ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో 298 పోస్టులున్నాయి. బీసీ సంక్షేమశాఖలో గ్రేడ్‌-2 మొత్తం 140 పోస్టుల్లో ప్రీమెట్రిక్‌ బాలుర వసతి గృహాల్లో 87, పోస్టుమెట్రిక్‌ బాలుర వసతి గృహాల్లో 14, ప్రీమెట్రిక్‌ బాలికల వసతి గృహాల్లో 26, పోస్టుమెట్రిక్‌ బాలికల వసతి గృహాల్లో 13 ఖాళీలు ఉన్నాయి.

☛ గిరిజన సంక్షేమ వసతిగృహ అధికారులు గ్రేడ్‌-1 - 5; గ్రేడ్‌-2 : 106
☛ ఎస్సీ సంక్షేమ వసతి గృహ అధికారులు  గ్రేడ్‌-2 (మహిళ) : 70; గ్రేడ్‌-2 (పురుషులు) : 228
☛ బీసీ సంక్షేమ వసతి గృహ అధికారులు గ్రేడ్‌-2 : 140
☛ చిన్నారుల సంరక్షణ గృహాల్లో లేడీ సూపరింటెండెంట్లు : 19
☛ దివ్యాంగుల సంక్షేమశాఖలో వార్డెన్‌ గ్రేడ్ -1 : 5; వార్డెన్‌ గ్రేడ్‌-2 : 3
☛ దివ్యాంగుల సంక్షేమశాఖలో మాట్రన్‌ గ్రేడ్‌-1 : 3; మాట్రన్‌ గ్రేడ్‌-2 : 2

తెలంగాణ గురుకులల్లోని వివిధ ఉద్యోగాల ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

#Tags