TGPSC Certificates Verification: HWO అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: పలు సంక్షేమ శాఖల్లో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌–2) ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన న‌వంబ‌ర్‌ 14 నుంచి 30వ తేదీ వరకు నాంపల్లిలోని పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి ఇ.నవీన్‌నికోలస్‌ న‌వంబ‌ర్‌ 1న ఒక ప్రకటనలో తెలిపారు.

1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జరిగిందని, డిజేబుల్‌ కేటగిరీలో మాత్రం 1:5 నిష్పత్తిలో చేసినట్లు వెల్లడించారు. పరిశీలన తేదీల వారీగా అభ్యర్థులు వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. నిర్దేశించిన తేదీల్లో అన్ని రకాల ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

చదవండి: TGPSC Group 1 Jobs: ఈ రెండు కేటగిరీల్లో తీవ్ర పోటీ!.. ఒక్కో పోస్టుకు ఇంత‌ మంది పోటీ!

పరిశీలన ప్రక్రియకు గైర్హాజరైతే మరోమారు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు సమర్పించేందుకు న‌వంబ‌ర్‌ 13వ తేదీ నుంచి డిసెంబర్‌ 4వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags