TSPSC: విద్యాశాఖలో డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: విద్యాశాఖలో గెజిటెడ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నిర్వహించే డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌ పేపర్‌ కోడ్‌ 88, 97 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మే 29న‌ ఒక ప్రకటనలో తెలిపింది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

జూన్‌ 12, 21 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించే ఈ పరీక్షలను ఉద్యోగుల వినతుల మేరకు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. కొత్త తేదీలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.  

#Tags