TSPSC: 17 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల నియామకం

సాక్షి, హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జూన్ 10న‌ పలువురు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లకు నియామక పత్రాలను అందజేశారు.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా (జోన్‌ –  ఐ నుంచి – 5, జోన్‌ –  ఐఐ నుంచి – 12 మంది) పదిహేడు మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, నకిలీ మందుల తయారీదారులపై ఉక్కు పాదం మోపుతామన్నారు.

చదవండి: TSPSC Group 1 Prelims: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు తీవ్ర పోటీ.. క్వాలిఫయింగ్‌ మార్కులు పెరిగే ఛాన్స్‌

నకిలీ మందుల తయారీని అడ్డుకోవడం, అక్రమాలకు పాల్పడేవారిపై నిరంతర పర్యవేక్షణ కోసం కొత్తగా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల నియామకాన్ని చేపట్టామన్నారు. నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులకు మంత్రి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్వీ కర్ణన్, జాయింట్‌ డైరెక్టర్‌ రామ్‌దాస్‌లు పాల్గొన్నారు.  

#Tags