TSPSC: ప్రశాంతంగా ఏఈఈ అర్హత పరీక్ష.. వెబ్‌సైట్‌లో ఈ పరీక్ష హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) అర్హత పరీక్ష తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది.
ఇదివరకు ఓఎంఆర్ ఆధారిత పరీక్ష నిర్వహించిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్... ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పునర్నిర్వహణ చేపట్టింది. మే 8, 9 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(సీబీఆర్‌టీ) పద్ధతిలో పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. తొలిరోజైన మే 8న కొన్ని కేటగిరీలకు ఉదయం 10గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు రెండు సెషన్లు నిర్వహించింది. కాగా, మే 8న ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో హయత్‌నగర్‌తో పాటు పలుచోట్ల అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు.
చదవండి: TSPSC: ఏఈ పేపర్ ‘చూపించడానికి’ రూ.2 లక్షలు!
వెబ్‌సైట్‌లో ఏఓ హాల్‌టికెట్లు
మే 16వ తేదీన జరగనున్న వ్యవసాయ సహకార శాఖల్లో అగ్రికల్చర్ ఆఫీసర్(ఏఓ) పరీక్ష హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
#Tags