TS Constable Jobs : కానిస్టేబుల్‌ అభ్యర్థులకు టెస్ట్‌లు .. ఎప్పుటినుంచి అంటే..?

సాక్షి ఎడ్యుకేషన్‌ : తెలంగాణ పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) పోస్టుల డ్రైవింగ్, మెకానిక్‌ ట్రేడ్‌ పరీక్షలను మార్చి 2 నుంచి నిర్వహించనున్నట్టు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.
ts police

పోలీస్‌ శాఖలో 100 డ్రైవర్, అగ్నిమాప‌క‌శాఖలో 225 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. 

చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్

మార్చి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు..
అర్హులైన అభ్యర్థులకు మార్చి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు డ్రైవింగ్‌ పరీక్షలు అంబర్‌పేట్‌లోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్టు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు  www.tslprb.in వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులను ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 8  నుంచి 28 అర్ధరాత్రి 12 గంటల వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. వీటిని ఏ4 సైజులో ప్రింటవుట్‌ తీసుకోవాలని సూచించారు. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌లో ఇబ్బందులుంటే support@tslprb.in ఈమెయిల్‌ ఐడీ లేదా 9393711110 లేదా 939100 5006 నంబర్లలో సంప్రదించాలన్నారు.

☛ Police Jobs: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సిలబస్‌ ఇదే.. ఇలా చదివితే..

ఈ ధ్రువపత్రాలు.. 
డ్రైవింగ్‌ టెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షల్లో సాధించిన మార్కుల వివరాలు, ఒరిజినల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్, హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్, ఐటీఐ ధ్రువపత్రాలు అన్నీ స్వీయ ధ్రువీకరణ చేసుకుని తేవాలని సూచించారు.

☛ Police Exam Tips: మూడు టెక్నిక్‌లు పాటిస్తే .. పోలీసు ఉద్యోగం మీదే..!

#Tags