TS SI Jobs Selected Candidates Success Stories : నిరుపేద కుటుంబం నుంచి వ‌చ్చారు.. ఇలా చ‌దివారు.. అలా ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా..

పేదరికం చ‌దువుకు.. ఉద్యోగానికి అడ్డ‌కాద‌ని నిరూపించారు.. కొత్త‌గా ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికైన తెలంగాణ‌కు చెందిన పేదింటి బిడ్డ‌లు. వీరు సాధించాల‌నే పట్టుదల, కృషి ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించారు.
TS SI Jobs Selected Candidates Success Stories

ఈ ఎస్‌ఐ పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల్లో ఎస్సై, ఏఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి ఆగస్టు 6వ తేదీన (ఆదివారం) విడుదల చేసిన విష‌యం తెల్సిందే.

☛ Women SI Success Story : ఓ పేదింటి బిడ్డ 'ఎస్ఐ' ఉద్యోగం కొట్టిందిలా.. ఈమె విజ‌యం కోసం..

ఈ ఫ‌లితాల్లో చాలా మంది పేదింటి అణిముత్యాలు విజ‌యం సాధించి.. వాళ్ల త‌ల్లిదండ్రులల్లో ఆనందాన్ని నింపారు. ఈ నేప‌థ్యంలో వీరి స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

ఎస్ఐ ఫైన‌ల్‌ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా నుంచి పలువురు నిరుపేద‌లు కొలువులు సాధించారు. మోపాల్‌ మండలం నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. బోర్గాం(పి) గ్రామానికి చెందిన చామకూర జీవన్‌రెడ్డి, బైరాపూర్‌కు చెందిన మూడ్‌ అజయ్‌, అమ్రాబాద్‌కు చెందిన బోడ పీర్‌సింగ్‌ నాయక్‌ ఎంపికయ్యారు. 

☛➤ టీఎస్ ఎస్సై, ఏఎస్సై పోస్టుల కటాఫ్‌ మార్కుల కోసం క్లిక్ చేయండి

జీవన్‌రెడ్డి గతంలో ఆర్మీలో 17.5 ఏళ్లు ఉద్యోగం చేసి ప‌ద‌వివిరమణ పొందారు. తాజాగా ఎస్సై ఉద్యోగానికి ఎంపిక కావడంపై వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

☛➤ టీఎస్‌ ఎస్సై, ఏఎస్సై పోస్టుల‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి 

పీర్‌సింగ్‌ నాయక్‌ గతంలో ఒకసారి ఎస్సై ఉద్యోగానికి ప్రయత్నించగా విఫలమయ్యారు. ఎలాగైనా ఉ ద్యోగం సాధించాలనే తపనతో ప్రయత్నించి సాధించారు. హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తి చేసిన పీర్‌సింగ్‌ నాయక్‌ తల్లిదండ్రులు లక్ష్మీబాయి, రాయ్‌చంద్‌ నాయక్‌. వీరు కూడా వ్యవసాయాధికారిత కుటుంబం.మూడ్‌ అజయ్‌ తల్లిదండ్రులు నిర్మల, లచ్చు. వీరు వ్యవసాయం చేస్తూ కొడుకును చదివించారు.

☛➤ టీఎస్‌ ఎస్సై, ఏఎస్సై పోస్టుల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

నిరుపేద కుటుంబం నుంచి..

ఆర్ముర్‌ మండలం ఇస్సాపల్లి గ్రామానికి చెందిన సట్లపల్లి పూజ ఎస్సై ఉద్యోగానికి ఎంపికైంది. వీరిది నిరుపేద కుటుంబం. తండ్రి సట్లపల్లి నడిపి ముత్తెన్న, త‌ల్లి సాయమ్మ. పూజ ఇస్సాపల్లి ప్రభుత్వ పాఠశాలలో 2013–14లో 10వ తరగతిలో ఉత్తమ జీపీఏ సాధించి బాసర ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించింది. అనంతరం హైదరాబాద్‌ టీసీఎస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి ఎంపికైంది. పోలీస్‌ శాఖలో ఎస్సై నోటిఫికేషన్‌ రాగానే ఉద్యోగానికి రాజీనామా చేసి శిక్షణ తీసుకుని కష్టపడి చదివి తల్లిదండ్రుల కల నెరవేర్చింది.

☛ Inspirational Success Story : ఒక వైపు తండ్రి మ‌ర‌ణం.. మ‌రో వైపు కుటుంబంపై నింద‌లు.. ఈ క‌సితోనే చ‌దివి డీఎస్పీ ఉద్యోగం కొట్టానిలా..

కమ్మర్‌పల్లి మండల కేంద్రానికి సల్లూరి కిషన్‌ గౌడ్‌, లక్ష్మి దంపతుల కొడుకు శ్రీ సాయి. శ్రీసాయి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఎస్ఐ ఫలితాల్లో 259 మార్కులు సాధించి ఈ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈయ‌న కర్ణాటకలోని మైసూర్‌లోని ఎల్‌అండ్‌టీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో రెండేళ్లుగా అసోసియేట్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. తొలి ప్రయత్నంలోనే ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.

ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికైన వారికి సంబంధించిన‌ ముఖ్యమైన తేదీలు.. కావాల్సిన పత్రాలు ఇవే..
ఎస్‌ఐ పరీక్షల్లో ఉత్తీర్ణ‌త సాధించి.. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 9 నుంచి 11 వరకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక ఫార్మాట్‌లో వారిపై ఉన్న కేసులు, మెడికల్‌ అంశాల వివరాలు అటెస్టేషన్‌ చేయించాలని సూచించారు. అటెస్టేషన్‌ కాపీని ఏ4 సైజులో ప్రింట్‌ తీసి, వాటిపై పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు అంటించి మూడు కాపీల్లో గెజిటెడ్‌ అధికారితో సంతకాలు చేయించి వాటిని సూచించిన కేంద్రాల్లో ఆగస్టు 14 నాటికి అందజేయాలని పేర్కొన్నారు.

☛ Group 1 Ranker Success Story : ఇప్పటికిప్పుడే అనుకొని చదివితే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా..? అన్నారు.. కానీ నేను మాత్రం..

ఎంపిక ప్రక్రియలో సందేహాల నివృత్తికి సైతం నియామక మండలి అవకాశం కల్పించింది. ఆగస్టు 7వ తేదీ నుంచి 9 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో సందేహాలు నివృత్తికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు ఎస్సీ, ఎస్టీలకు రూ.2వేలు, ఇతరులకు రూ.3వేలు ఆన్‌లైన్‌లో చెల్లించాలని బోర్డు అధికారులు పేర్కొన్నారు.

☛ Civil Ranker Story: ఫెయిల్యూర్ వ‌చ్చిన‌ప్పుడు చాలా తేలిగ్గా తీసుకున్నా.. నాలుగు సార్లు ఫెయిల్ అయ్యా.. కానీ..

434 మంది పురుషులు, 153 మంది మహిళల్ని..
ఎంపికైన అభ్యర్థుల జాబితా పోలీస్‌ నియామక మండలి వెబ్‌సైట్‌లో ఆగస్టు 7వ తేదీన (సోమవారం) ఉదయం నుంచి అందుబాటులో ఉంచింది. వివిధ విభాగాలకు చెందిన 587 ఉద్యోగాలకు 434 మంది పురుషులు, 153 మంది మహిళల్ని ఎంపికయ్య‌రు. ఆగస్టు 7వ తేదీన‌ ఎస్సై, ఏఎస్సై పోస్టుల కటాఫ్‌ మార్కుల కేటాయింపు, అభ్యర్థుల జన్మతేదీ వంటి వివరాలు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

☛ Police Officer Noujisha: సాయం కోసం స్టేష‌న్‌కి వెళ్లిన ఆమె.. ఇప్పుడు పోలీస్ ఆఫిస‌ర్‌..

#Tags