Special Police: 10 మంది టీజీఎస్పీ సిబ్బంది డిస్మిస్.. డిస్మిస్ గురైన సిబ్బంది వీరే..
సాక్షి, హైదరాబాద్: సెలవుల్లో మార్పులు, ఇతర డిమాండ్లతో ఆందోళనలు చేపట్టిన తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంది. తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న 10 మందిని గుర్తించి.. ఆర్టికల్ 311 ప్రకారం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
పోలీస్ మాన్యువల్‌కు విరుద్ధంగా వ్యవహరించడం, ఆందోళనలను రెచ్చగొట్టడం, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ క్రమశిక్షణను ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొంటూ డీజీపీ కార్యాలయం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: Rupla Naik Tanda: చదువుల తండా.. కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు...
ఉద్వాసనకు గురైన సిబ్బంది వీరే..:
3వ బెటాలియన్ కానిస్టేబుల్ జి.రవికుమార్.. 6వ బెటాలియన్ కానిస్టేబుల్ కె.భూషణ్‌రావు.. 12వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ ఎస్‌కే షరీఫ్.. 17వ బెటాలియన్ ఏఆర్‌ఎస్సై సాయిరామ్, కానిస్టేబుళ్లు కె.లక్ష్మీనారాయణ, ఎస్.కరుణాకర్‌రెడ్డి, టి.వంశీ, బండెల అశోక్, ఆర్.శ్రీనివాస్‌లను విధుల్లోంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags