Additional SP Chandraiah: పోలీస్‌శాఖకు మంచి పేరు తేవాలి
సిరిసిల్లక్రైం: శిక్షణ కానిస్టేబుళ్ల వృత్తిలో నిబద్ధతతో పోలీస్‌శాఖకు మంచి పేరు తేవాలని అడిషనల్ ఎస్పీ చంద్రయ్య కోరారు. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన వారితో ఫిబ్రవరి 20న సమావేశమయ్యారు.
ఇటీవల ఎంపికై న వారిలో 79 మంది పురుషుల్లో 31 మంది సివిల్, 48 మంది ఆర్ముడ్, 26 మంది మహిళల్లో 17 మంది సివిల్, 9 మంది ఆర్ముడ్ ట్రెయినీ కానిస్టేబుళ్లు ఉన్నట్లు తెలిపారు. వీరందరికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీతోపాటు ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో తొమ్మిది నెలల శిక్షణ ఉంటుందని వివరించారు.
నేటి పరిస్థితులకు తగ్గట్లుగా ప్రజలకు సేవలందించేలా శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణకు వెళ్తున్న ట్రెయినీ కానిస్టేబుళ్లుకు కిట్ ఆర్టికల్స్ అందించారు. సీఐలు అనిల్‌కుమార్, సదన్‌కుమార్, ఆర్‌ఐ మధుకర్, సీనియర్ అసిస్టెంట్ తిరుపతిరెడ్డి తదతరులు పాల్గొన్నారు.
#Tags