EWS: విద్యార్థులకూ కటాఫ్‌ తగ్గించాలి

పోలీస్‌ ఉద్యోగ నియామకాల్లో కటాఫ్‌ మార్కుల తగ్గింపు Economically Weaker Section (EWS) అభ్యర్థులకు కూడా వర్తింపజేయాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు.
విద్యార్థులకూ కటాఫ్‌ తగ్గించాలి

ఈ మేరకు అక్టోబర్‌ 18న ఆయన సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్‌అలీ, ఐటీ మంత్రి కేటీఆర్, సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డిలకు లేఖలు రాశారు.

చదవండి: TS Constable & SI Exam Cut off Marks: ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్షల కటాఫ్ మార్కులు ఇవే.. ఇన్ని మార్కులు సాధిస్తే..

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌పీఆర్‌బీ) విడుదల చేసిన నోటిఫికేషన్ల ప్రకారం పెట్టిన రాత పరీక్షల్లో కొన్ని వర్గాలకు కటాఫ్‌ మార్కులు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని, బీసీలతో సమానంగా 25 శాతం అంటే 50 మార్కులుగా కటాఫ్‌ నిర్ణయించాలని ఆ లేఖలో కోరారు. 

చదవండి: TS Police Jobs 2022 : తెలంగాణ పోలీసు ఉద్యోగాల‌కు కటాఫ్‌ మార్కులు ఇలా..కేటగిరీల వారీగా..

#Tags