NPDCLలో ఉద్యోగాలు.. దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తర మండల డిస్కంలో 100 ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. డిగ్రీ, తత్సమాన విద్యార్హతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండి ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సర్టిఫికెట్‌ పొందిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
NPDCLలో ఉద్యోగాలు.. దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ ఇదే..

18–44 ఏళ్లలోపు వయసున్న వారు ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్‌ 29న తుది గడువని, మే 22 నుంచి హాల్‌టికెట్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.

చదవండి: TSNPDCL Jobs Notification 2023: టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ లో 157 పోస్టులు.. నెలకు రూ.35,000 జీతం

మే 28న రాతపరీక్ష ఉంటుందని వివరించారు. పూర్తి వివరాలు, దరఖాస్తుల సమర్పణకు http://tsnpdc l.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 

చదవండి: TS NPDCL : ఎన్పీడీసీఎల్ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వ‌లేదు.. ఇలాంటి కథనాలను నమ్మవద్దు..

#Tags