TS Inter Results 2024 : 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఈసారి ఇలా..

సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలపై స్పష్టత వచ్చింది. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

ఒకేసారి మొదటి, రెండవ ఫలితాలు ఒకే సారి చేస్తామన్నారు. ఈ మేర‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంట‌ర్ ఫలితాలకు సంబంధించి అన్ని దశల్లోనూ పరిశీలన పూర్తయిందని, ఎలాంటి లోటు పాట్లు లేవని భావించిన నేపథ్యంలోనే ఫలితాల వెల్లడికి రంగం సిద్ధం చేస్తున్నామని ఇంట‌ర్ బోర్డ్ అధికారులు తెలిపారు.

చదవండి: Best Courses After Inter: ఇంటర్‌ తర్వాత చదవడానికి అవకాశం ఉన్న టాప్‌ 100 కోర్సులు.. వాటి వివరాలు.

ఈ సారి తెలంగాణ‌ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్-2024 ఫలితాలను ఒకే ఒక్క క్లిక్‌తో అంద‌రి కంటే ముందుగానే సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఫ‌లితాల కోసం 9 ల‌క్ష‌ల మందికి పైగా విద్యార్థులు ఎదురుచూపు..

మార్చి 6వ తేదీ నుంచే మూల్యాంకన ప్రక్రియ మొదలు పెట్టారు. దాదాపు 60 లక్షల సమాధాన పత్రాల మూల్యాంకనను మార్చి నెలాఖరుతో పూర్తి చేశారు. ఏప్రిల్ మొదటి వారంలో ఓఎంఆర్‌ షీట్ల డీ కోడింగ్‌ చేశారు. మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత అన్ని విధాలా పరిశీలన చేశారు.

ఎలాంటి సమస్యలు లేకపోవడంతో అధికారికంగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. తెలంగాణ ఇంటర్ పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 4,78,527 మంది ఫస్టియర్ విద్యార్థులు, 4,43,993 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాశారు.

చదవండి: After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్‌ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!

#Tags